Malkajgiri: లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి.. పట్నం సునితా మహేందర్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపుతోనున్నారు.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఇక, శుక్రవారం రోజు కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పర్వతనగర్, వివేకానంద నగర్, తులసినగర్, గాయత్రి నగర్, జనప్రియ నగర్‌లో మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేంధర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.. నియోజకవర్గ ఇంఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
Read Also: BRS Foundation Day: నేడు బీఆర్‌ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవం..
ఇక, కాంగ్రెస్ నినాదాలు హోరు మధ్య సునితమ్మ ప్రచారం జోరుగా సాగింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తనను గెలిపిస్తే పాలకురాలిగా కాకుండా 5 ఏళ్లు సేవకురాలిగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు సునితా మహేందర్‌రెడ్డి.. ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. ఈ కార్యక్రంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ బండి రమేష్, డివిజన్ అధ్యక్షులు మొయినోద్దీన్, డివిజన్ సీనియర్ నాయకులు విట్ఠల్ రెడ్డి, సీనియర్ నాయకులు శేరి సతీష్ రెడ్డి, గోపిశెట్టి రాఘవేందర్, నర్సింహా యాదవ్, సుంకన్న, షఫియోద్దీన్, పల్లపు వేణు, జమీర్, అబ్దుల్లా, కనకయ్య, రంగారావు, మస్తాన్ రెడ్డి, నాగిరెడ్డి, ఆదిరెడ్డి, జాకీర్ పాషా, రాము పాల్గొన్నారు. మరోవైపు.. కూకట్‌పల్లి 114 డివిజన్ లో సునితమ్మ ప్రచారంకు జనం బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గ సీనియర్ నాయకులు శేరి సతీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం రోడ్డు షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీతో ఇవ్వాలని కోరారు. కార్యక్రంలో భరత్ రెడ్డి, 144 డివిజన్ అధ్యక్షులు మారుతి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.