Site icon NTV Telugu

Maldives Tourism Rankings: మాల్దీవులు టూరిజం ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి భారత్

Maldives Tourism

Maldives Tourism

భారత్- మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్యపరమైన వివాదం కారణంగా మాల్దీవులు టూరిజం ర్యాంకింగ్స్‌లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఐదో స్థానానికి పడిపోయింది. మాల్దీవులు పర్యాటక శాఖ విడుదల చేసిన తాజా డేటా వివరాల ప్రకారం.. డిసెంబర్ 2023లో అగ్రస్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం ఐదో స్థానానికి దిగజారిపోయింది. 2024 జనవరి 28 నాటికి మాల్దీవులు టూరిజంతో భారత్ వాటా కేవలం 8 శాతం ఉండగా చైనా 9.5శాతం, యూకే 8.1శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం 13 వేల 989 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. ఈ ఏడాది జనవరి మాసంలో అత్యధిక మంది పర్యాటకులను మాల్దీవులకు పంపిన దేశాల్లో రష్యా (18,561), ఇటలీ (18,111), చైనా (16,529) , యూకే (14,588) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కేవలం ఒక నెలలోనే మాల్దీవుల టూరిజం మార్కెట్‌లో భారత్ యొక్క స్థానం గణనీయంగా పడిపోడం గమనార్హం. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన నేపథ్యంలో ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి.

Read Also: Ajith Kumar: అక్కడ విడ ముయార్చి షూటింగ్ కంప్లీట్ అయ్యింది…

ఇక, బీచ్‌లు, లగ్జరీ టూరిజానికి ప్రసిద్ధి చెందిన మాల్దీవులకు 2023లో అతి పెద్ద టూరిజం మార్కెట్‌గా భారతదేశం ఉండేది. 2020కి ముందు చైనా ఫస్ట్ స్థానంలో ఉండేది. కానీ, 2020 తర్వాత భారత్ నుంచి మాల్దీవులు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన పరిణామాల వల్ల మళ్లీ భారత్ ఐడో స్థానానికి పడిపోయింది. ఇటీవల మాల్దీవులు అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జు చైనా అనుకూల నేతగా పరిగణించసడటంతో చైనీయులు మాల్దీవులు పర్యటనకు అత్యధికంగా వెళ్తున్నారు. తాజాగా ముయిజ్జూపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ రెడీ అయింది.

Exit mobile version