Ajith Kumar: అక్కడ విడ ముయార్చి షూటింగ్ కంప్లీట్ అయ్యింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక స్టార్ హీరో అజిత్. తల అజిత్ గా పేరు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో… సూపర్ యాక్టర్ కూడా. ఎలాంటి రోల్ లో అయినా సూపర్బ్ గా పెర్ఫార్మ్ చేయగల అజిత్, హీరో ఇలానే ఉండాలి అనే కొలమానాలని పూర్తిగా చెరిపేసి హీరో అనే పదానికే కొత్త లెక్కలు నేర్పిస్తున్నాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్… అసలు డై వేయని హెయిర్, సిక్స్ ప్యాక్ ఉంటేనే హీరో అనే మాట నుంచి యాక్టింగ్ చేస్తే చాలు హీరో అనే వరకు అజిత్ ప్రయాణం చాలా గొప్పగా ఉంటుంది. 2023 సంక్రాంతికి తునివు సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చి కరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు అజిత్. ఏడాది దాటుతున్నా అజిత్ నుంచి ఇంకో సినిమా రాలేదు. ఎప్పటిలాగే అజిత్ సినిమా సినిమాకి మధ్య బాగా టైమ్ తీసుకుంటున్నాడు.
అజిత్ ఈసారి టైమ్ తీసుకున్నా కూడా యాక్షన్ అడ్వెంచర్ సినిమాని ఆడియన్స్ ని ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు ఉన్నాడు. కమర్షియల్ డైరెక్టర్ మజిల్ తిరుమేణి దర్శకత్వంలో నటిస్తున్న అజిత్ విడ ముయార్చి సినిమా చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అనౌన్స్మెంట్ నుంచి బజ్ జనరేట్ చేసిన విడ ముయార్చి సినిమా లేటెస్ట్ షెడ్యూల్ అజర్భైజాన్ లో జరుపుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన టార్గెట్ గా జరిగిన ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. షెడ్యూల్ కంప్లీట్ చేసుకోని అజిత్ అండ్ టీమ్ ఇండియా తిరిగి వస్తున్నారు. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్… నెక్స్ట్ అడ్వెంచర్ అంటూ లైకా నుంచి ట్వీట్ వచ్చింది. రెగ్యులర్ గా అజిత్ సినిమాల విషయంలో ఇలాంటి అప్డేట్స్ రావు. మొదటిసారి లైకా నుంచి అప్డేట్స్ బయటకి వస్తుండడంతో… తల ఫ్యాన్స్ సూపర్ జోష్ లో ఉన్నారు.
Also Read
Done with the AZERBAIJAN 🇦🇿 schedule! The VIDAA MUYARCHI team has wrapped up & is gearing up for a new adventure at a new location. 📍🌏#VidaaMuyarchi #AjithKumar #MagizhThirumeni @anirudhofficial @trishtrashers @akarjunofficial @ReginaCassandra @Aravoffl @omdop… pic.twitter.com/CTbAIDkOpf
— Lyca Productions (@LycaProductions) January 29, 2024
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!