ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో భారతీయ పర్యాటకులు బుకింగ్‌లను రద్దు చేసుకుంటున్నారు. ఈ సంఘటనల మధ్య మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనా నుంచి ఎక్కువ మంది పర్యాటకులను తన దేశానికి పంపే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చైనాలో తన ఐదు రోజుల అధికారిక పర్యటనలో ముయిజ్జూ ఫుజియాన్ ప్రావిన్స్‌లో ‘మాల్దీవులు బిజినెస్ ఫోరం’లో ప్రసంగిస్తూ.. చైనాను తమ మిత్రుడుగా అభివర్ణించాడు..
ఇక, 2014లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రారంభించిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ (BRI) ప్రాజెక్టుపై ముయిజ్జూ ప్రశంసించారు. మాల్దీవుల చరిత్రలో చూడని అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చైనా అందించిందన్నాడు. ఈ సందర్భంగా మాల్దీవులకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులను పంపాలని ఆయన డ్రాగన్ కంట్రీని కోరారు. ఇక, కరోనా కంటే ముందు చైనాకు చెందిన పర్యటకులు అత్యధిక సంఖ్యలో మాల్దీవులను సందర్శించేది.. తిరిగి మళ్లీ తమ పర్యటనలకు వేగవంతం చేయాలని చైనాను కోరుతున్నాను అని మహ్మద్ ముయిజ్జూ పేర్కొన్నారు.
Read Also: Vivo Y28 5G: అతి తక్కువ బడ్జెట్ లో వివో కొత్త స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్..
కాగా, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి రెండు దేశాలు 50 మిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ప్రాజెక్ట్‌పై సంతకం చేశాయి. అయితే, ప్రధాని మోడీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన సందర్భంగా బీచ్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసిన తర్వాత కొందరు మాల్దీవుల మంత్రులు ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో దౌత్యపరమైన వివాదం నెలకొంది. ఇక, సోషల్ మీడియాలో మోడీపై అవమానకరమైన పోస్టులు పెట్టినందుకు ముగ్గురు డిప్యూటీ మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ గతంలో విడుదల చేసిన డేటా ప్రకారం.. 2023లో భారతదేశం అతి పెద్ద పర్యాటక మార్కెట్‌గా మిగిలిపోయింది. గతేడాది అత్యధికంగా 2 లక్షల 9 వేల 198 మంది భారతీయులు పర్యటించగా.. రష్యాకు చెందిన పర్యాటకులు కూడా 2 లక్షల 9 వేల146 మంది పర్యటించారు. థర్డ్ ప్లేస్ లో చైనాకు చెందిన పర్యాటకులు 1,87,118 మంది పర్యటించినట్లు వెల్లడించింది.