ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో వై28 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.. జనవరి 8 న ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 720×1,612 పిక్సెల్, 90Hz రిఫ్రెష్ రేట్, 840 nits బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్ ఆక్టా-కోర్ 7nm మీడియాటెక్ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.. కెమెరాను చూస్తే సెల్ఫీ ప్రియులకు పండగే అని చెప్పాలి.. 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 15వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ ఈ ఫోన్ సొంతం..ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సైడ్‌కు అందించారు…
ఇకపోతే ఈ ఫోన్ ధర విషయానికోస్తే.. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999కాగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,499గా నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999గా ఉంది.. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్‌తో పాటు వివో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసిని వారికి అదనంగా రూ. 1500 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకు మీ సొంతం చేసుకోవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి..