NTV Telugu Site icon

Maldives President: మే 10 నాటికి మాల్దీవుల నుంచి భారత సైన్యం వెళ్లి పోవాల్సిందే..

Mohamed Muizzu

Mohamed Muizzu

India-Maldives Row: భారత్- మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాల కారణంగా సంబంధాలు రోజు రోజుకు క్షిణిస్తున్నాయి. అయితే, మాల్దీవుల వ్యవహారాలలో భారతదేశ ప్రభావాన్ని తగ్గించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జూ దృష్టి సారించాడు. అందులో భాగంగానే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత సైనికుల ఉనికి ప్రధాన వివాదాంశంగా ప్రస్తావించాడు.

Read Also: Real Estate Frauds: రియల్ ఎస్టేట్ మోసాలపై పోలీసుల ఫోకస్.. ఇక నుంచి అలాంటివి చేస్తే జైలుకే..!

అయితే, ఇవాళ రాష్ట్రపతి హోదాలో మాల్దీవుల అధ్యక్షుడు ఆ దేశ పార్లమెంట్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మహ్మద్ ముయిజ్జూ మాట్లాడుతూ..తాన భారత వ్యతిరేక వైఖరికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. మాల్దీవుల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి ఏ దేశాన్ని అనుమతించేది లేదని తెలిపారు. మే 10 నాటికి భారత దళాలు మాల్దీవులను విడిచిపెట్టనున్నారు. కాగా, మాల్దీవులలో ఉన్న భారతీయ దళాలు మార్చి 10 నాటికి బయలు దేరుతాయి.. మిగిలిన సైనికులు మే 10 నాటికి పూర్తిగా ఈ దేశం వదిలి వెళ్లిపోతారని ప్రెసిడెంట్ ముయిజ్జూ వెల్లడించారు.

Read Also: Masth Shades Unnai Ra: మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా నుంచి ఆకట్టుకుంటున్న ‘హలో అమ్మాయి’ సాంగ్..

అలాగే, న్యూఢిల్లీలో భారత్- మాల్దీవుల మధ్య జరిగిన సమావేశంలో బలగాల ఉపసంహరణపై ఇరు పక్షాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. మాల్దీవులకు మానవతా సేవలను అందించే భారతీయ విమానయాన సర్వీసులను ప్రారంభించడానికి రెండు దేశాలు పరస్పరం ఒప్పుకున్నాయి. అలాగే, భారత సైనికుల స్థానంలో పౌరులు ఉంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదించింది.

Read Also: AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ.. ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

ఇక, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరితో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ముయిజ్జూ సర్కార్ చైనాకు అనుకూలంగా పని చేయడంతో తీవ్ర స్థాయిలో ఆ దేశ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల భారతదేశంతో మాల్దీవుల సాంప్రదాయకంగా సన్నిహిత సంబంధాల పూర్తిగా దెబ్బ తినే ప్రమాదం ఉందని ఆరోపించారు. వెంటనే మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత్‌కు క్షమాపణ చెప్పాలని ఆ దేశ ప్రతిపక్షా పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.