T20 World Cup: ఖాతా తెరవని ఆరుగురు బ్యాటర్లు.. 13 బంతుల్లోనే విజయం! టీ20ల్లో అత్యంత చెత్త టీమ్ ఇదే
- 31 పరుగులకు అలౌటైన మంగోలియన్
- ఖాతా తెరవని ఆరుగురు బ్యాటర్లు
- ఒకే ఒక్క బౌండరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mongolia All Out for 31 Runs vs Malaysia: మంగోలియన్ క్రికెట్ జట్టు మరోసారి పేలవ ప్రదర్శన చేసింది. కొద్ది రోజుల క్రితం కేవలం 17 పరుగులకే అలౌటైన మంగోలియన్ టీమ్.. తాజాగా 31 పరుగులకు కుప్పకూలింది. మలేషియాలోని యూకేఎం ఓవల్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఈ చెత్త ప్రదర్శన నమోదు చేసింది. మంగోలియన్ జట్టులో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు ఖాతానే తెరవలేదు. ప్రత్యర్థి మలేషియా కేవలం 13 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్ చేసి భారీ విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మంగోలియా 16.1 ఓవర్లలో 31 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మోహన్ వివేకానందన్ (8) టాప్ స్కోరర్. 26 బంతుల్లో 8 పరుగులు చేశాడు. మంగోలియా జట్టులోని ఆరుగురు బ్యాటర్లు ఖాతానే తెరవలేదు. ఈ మ్యాచ్‌లో మంగోలియన్ టీమ్ ఒకే ఒక్క బౌండరీని నమోదుచేసింది. ఎంఖ్‌బాత్ బత్ఖుగ్ ఒక బౌండరీ బాదాడు. మలేషియా బౌలర్ విరణ్ దీప్ సింగ్ 4 ఓవర్లలో 5 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. రిజ్వాన్ హైదర్, పవన్‌దీప్ సింగ్, విజయ్ ఉన్ని, మహ్మద్ అమీర్, సయ్యద్ అజీజ్ తలో వికెట్ పడగొట్టారు.
Also Read
Also Read: IND vs BAN: సర్ఫరాజ్ ఖాన్‌కు.. స్టార్ బ్యాటర్‌కు ఛాన్స్?
31 పరుగుల లక్ష్యాన్ని మలేషియా 2.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా పూర్తిచేసింది. మలేషియా కెప్టెన్ కమ్ ఓపెనర్ సయ్యద్ అజీజ్ 11 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ జుబైద్ జుల్కిఫ్లే 3 బంతుల్లో 3 పరుగులు చేశాడు. మంగోలియా జట్టు గతంలో కువైట్, హాంకాంగ్, మయన్మార్, సింగపూర్, మాల్దీవుల చేతిలో కూడా ఘోర పరాజయాలను ఎదుర్కొంది. ఈ ఓటమితో మంగోలియా టీ20 ప్రపంచకప్ అర్హత ఆశలు గల్లంతయ్యాయి. క్వాలిఫయర్స్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!