ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న గ్లామర్ బ్యూటీ మాళవిక మోహనన్, ఇండస్ట్రీలోని ఒక చేదు నిజంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’లో మెరిసిన ఈ భామ, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ల మార్కెట్ పట్ల నిర్మాతలు చూపుతున్న వివక్షను ఎండగట్టింది. మన దగ్గర భారీ బడ్జెట్ సినిమాలు అంటే కేవలం హీరోలవే ఎందుకు ఉంటున్నాయని ఆమె ప్రశ్నించింది. హీరోయిన్ మెయిన్ రోల్‌లో ఉంటే థియేటర్లకు జనాలు రారని, బాక్సాఫీస్ వసూళ్లు ఉండవని ప్రొడ్యూసర్లు ముందే ఒక ఫిక్స్‌డ్ ఓపీనియన్‌కు వచ్చేస్తారని, అందుకే ఒక లిమిట్ దాటి ఖర్చు చేయడానికి భయపడుతున్నారని మాళవిక కుండబద్దలు కొట్టింది.
Also Read : Rimi Sen : భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు.. అందుకే దుబాయ్‌కు వెళ్ళిపోయానన్న రిమీ సేన్!
నిర్మాతలు ధైర్యం చేసి కంటెంట్‌ను నమ్మితే ఏదైనా సాధ్యమేనని చెప్పడానికి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లోక’ను ఆమె ఉదాహరణగా చూపింది. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ భారీగా ఖర్చు చేశారని, ఫలితంగా ఆ చిత్రం ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించిందని గుర్తు చేసింది. “కంటెంట్ బాగుండి, ప్రొడ్యూసర్లు నమ్మి అవకాశం ఇస్తే హీరోయిన్లు కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తారు” అని మాళవిక తన మనసులోని మాటను బయటపెట్టింది. గతేడాది ‘హృదయపూర్వం’తో హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుతున్న ధోరణులపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
