Pushpa 2 Climax: ‘పోతారు.. మొత్తం పోతారు’.. పుష్ప 2 క్లైమాక్స్‌పై మేకర్స్ ట్వీట్!
- పుష్ప 2 క్లైమాక్స్ షూటింగ్
- ఈసారి మరో వేరే లెవెల్
- మొత్తం పోతారు అంటున్న మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుష్ప’ పార్ట్ 1 క్లైమాక్స్‌లో పుష్పరాజ్, షెకావత్ సార్ మధ్య ఫైట్ జరగదు. కానీ వాళ్లిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ మాత్రం ఫైట్ మాదిరే ఉంటుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇలాంటి క్లైమాక్స్ లేదనే చెప్పాలి. ఇద్దరు మధ్య పగను పెంచేలా.. పుష్ప పార్ట్ 2కి లీడ్ ఇచ్చేలా పార్ట్ 1ను సిరెక్టర్ సుకుమార్ ఎండ్ చేశాడు. కానీ ఈ సారి మాత్రం అలా కాదని అంటున్నారు. సినిమాలో వచ్చే ఒక్కో యాక్షన్ ఎపిసోడ్.. ఆడియెన్స్‌ను సీట్లో కూర్చోకుండా చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ అమ్మవారి గెటప్‌లో వచ్చే గంగమ్మ జాతర సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని, జపాన్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మామూలుగా ఉండవని మేకర్స్ అంటున్నారు. ఇక క్లైమాక్స్‌కు మాత్రం ‘పోతారు.. మొత్తం పోతారు’ అని అంటున్నారు. ఇటీవల ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్, సుకుమార్.. పుష్ప 2 క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోందని చెప్పారు. ఈసారి మరో వేరే లెవెల్ అని చెప్పుకొచ్చారు. అభిమానులకు ఈ చిత్రం అంకితం అని బన్నీ పేర్కొన్నారు. అప్పటినుంచి ట్విట్టర్‌లో పుష్ప2 క్లైమాక్స్ గురించే చర్చ నడుస్తోంది.
Also Read
- Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
- RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
- Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
Also Read: Rohan Jaitley-BCCI: బీసీసీఐ కార్యదర్శి పోస్ట్.. రోహన్ జైట్లీ ఏమన్నారంటే?
ఓ అభిమాని పుష్ప2 క్లైమాక్స్ గురించి ప్రస్తావిస్తూ.. ‘సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది, ఇచ్చి పడేసారు అని టాక్. ఏమంటావ్ పుష్పరాజ్?. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంటుందో ఒక హింట్ ఇవ్వొచ్చుగా?’ అని పుష్ప అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేశాడు. దీనికి మేకర్స్ రిప్లే ఇచ్చారు. న్యాచురల్ స్టార్ నాని తాజాగా మూవీ ‘సరిపోదా శనివారం’ నుంచి.. ‘పోతారు.. మొత్తం పోతారు’ అనే డైలాగ్‌ను షేర్ చేశారు. దీంతో పుష్ప2 క్లైమాక్స్‌పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఖచ్చింతగా ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరుతుందని బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్ 6న పుష్పరాజ్ చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
-
Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
-
RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
-
The Odyssey: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న ‘ది ఒడిస్సీ’ టికెట్లు! లక్షకు పైగా..
-
Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!