Rohan Jaitley-BCCI: బీసీసీఐ కార్యదర్శి పోస్ట్.. రోహన్ జైట్లీ ఏమన్నారంటే?
- ఐసీసీ ఛైర్మన్‌గా జై షా
- బీసీసీఐ కార్యదర్శిగా రోహన్ జైట్లీ
- తండ్రి లాగే రోహన్ కూడా న్యాయవాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohan Jaitley About BCCI Secretary Post: ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు అందుకోవడం లాంఛనమే. నామినేషన్ వేయడానికి నేడు ఆఖరు తేదీ కాగా.. షాకు ఏకంగా 15 మంది (16 మందిలో) మద్దతు ఉంది. ఐసీసీ ఛైర్మన్‌గా షా వెళితే.. బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు ఎన్నికవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పదవి రేసులో చాలామంది ప్రముఖుల పేర్లు వినబడుతున్నాయి. ఇందులో ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు (డీడీసీఏ) రోహన్ జైట్లీ కూడా ఉన్నారు. బీసీసీఐ కార్యదర్శిగా రోహన్ బాధ్యతలను చేపడతారని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై తాజాగా ఆయన స్పందించారు.
Also Read: IPL 2025 Auction: ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకునే నలుగురు ప్లేయర్స్ వీరే.. మార్క్‌రమ్, మార్కోకు టాటా!
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలను చేపడతానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను రోహన్ జైట్లీ ఖండించారు. నెట్టింట వస్తున్న వార్తలన్నీ తప్పుడు కథనాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఢిల్లీ ప్రిమియర్ లీగ్‌ను ప్రమోట్ చేయడంపైనే దృష్టిసారించినట్లు తెలిపారు. దివంగత బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ తనయుడే ఈ రోహన్. తండ్రి లాగే రోహన్ కూడా న్యాయవాది. నాలుగేళ్ల కింద డీడీసీఏ అధ్యక్షుడిగా అతడు ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!