NTV Telugu Site icon

BSP: మాయవతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించండి.. ఇండియా కూటమిలో చేరుతాం..

Mayawathi

Mayawathi

అధికార బీజేపీ పార్టీని ఓడించేందుకు విపక్ష పార్టీలు అన్ని కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే, ఈ కూటమిలో పలు పార్టీలకు చెందిన వారిని కూడా చేర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలు బహుజన్ సమాజ్ వాది పార్టీని సైతం భారత్ కూటమిలో జాయిన్ కావాలని కోరారు. దీనికి ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు స్పందిస్తూ.. బీఎస్పీ చీఫ్ మాయవతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించాలని షరతు విధించారు. దీంతో పాటే గత కొద్ది రోజులుగా మాయవతి ఢిల్లీలోనే ఉన్నారు.

Read Also: Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్ షా.. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు

అయితే, బీఎస్పీ ఎంపీ మలక్ నగర్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి నిజంగా బీజేపీని ఓడించాలనుకుంటే.. మాయావతిని భారత కూటమికి ప్రధాని అభ్యర్థిగా చేయాలని.. ఇది జరగకపోతే.. బీజేపీని గద్దె దించడం అసాధ్యం అని ఆయన చెప్పారు. మోడీని అడ్డుకునేందుకు బీఎస్పీతో పొత్తు అవసరం.. ఎందుకంటే, మాయావతికి 13 శాతం ఓట్లు, విపక్షాలకు 37-38 శాతం ఓట్లు నిర్ణయాత్మక ఆధిక్యాన్ని ఇవ్వగలవు.. ఇది ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకి 44 శాతం కంటే ఎక్కువగా ఉంది.. అయితే, భారత కూటమి అధికారంలోకి రావాలంటే తప్పకుండా మాయావతిని భారతదేశ ప్రధానమంత్రిగా చేయాల్సిన అవసరం ఉందని మలక్ నగర్ అన్నారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే, దేశం మొత్తం ఏకతాటిపైకి వస్తుంది.. దాంతో పాటు ఓట్ల శాతం ఇండియా కూటమికి మేలు చేస్తుంది అని బీఎస్పీ ఎంపీ పేర్కొన్నారు.

Read Also: Vijayakanth: కోలీవుడ్ లో విషాదం… ‘ది కెప్టెన్’ ఇక సెలవు

ఇక, ఢిల్లీలో జరిగిన భారత కూటమి సమావేశంలో అఖిలేష్ యాదవ్ బీఎస్పీతో చర్చల అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఈ కూటమికి వెలుపల బీఎస్పీతో చర్చలు జరుపుతోందా.. బీఎస్పీని ఈ కూటమిలోకి తీసుకురావాలనుకుంటున్నారా? ముందుగానే ఈ విషయంలో కాంగ్రెస్ తన స్టాండ్‌ను స్పష్టం చేయాలి అని ఆయన కోరారు. అలాగే, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి కూడా బీఎస్పీ గురించి మాట్లాడుతూ.. తాము బీఎస్పీతో మాట్లాడటం లేదు.. మీడియాలో కథనాలు వచ్చాయి.. అయితే, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇండియా కూటమిలో చేరడం ఇష్టం లేదని మొదటి రోజు నుంచి చెబుతున్నారు.. బలవంతంగా వారిని కూటమిలో చేర్చుకోలేమని ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి వెల్లడించారు.