Site icon NTV Telugu

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్యాంకర్ ఢీ కొట్టడంతో గుంతలో పడ్డ ఆరు కార్లు..

Tanker

Tanker

Road Accident: ముంబైలోని ధారవి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న 6 కార్లను వేగంగా వచ్చిన ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనతో వాహనాలు కాలువలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారి గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లభించలేదు. ప్రమాదం శుక్రవారం ఉదయం 6 గంటలకు జరిగింది. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కకు ఆపి వాటి యజమానులు ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే, తెల్లవారుజామున అదుపుతప్పి వేగంగా వచ్చిన ట్యాంకర్ ఆ వాహనాలను ఢీ కొట్టడంతో కాలువలో పడిపోయాయి. ఈ ఘటనలో వాహనాలన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

Also Read: Vande Bharat : కోటాలో పరీక్షించిన తర్వాతే పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్.. దాని వేగం తెలిస్తే షాకే

దాంతో ప్రమాదం జరిగిన కొద్దీ సేపటికే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వారు ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా సంఘటనా స్థలానికి రప్పించి, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం చాలా ఘోరంగా జరిగిందని అక్కడి ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనందుకు అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ ప్రమాదం జరిగిన స్థానంలో పెద్ద నష్టం చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.

Exit mobile version