Site icon NTV Telugu

Mahmood Ali : టెక్నాలజీ వాడకం వల్ల దేశంలో తెలంగాణ పోలీస్ అగ్రస్థానంలో ఉంది

Mahmood Ali

Mahmood Ali

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవం పోలీస్ ఎక్స్పో నిర్వహించారు. సైఫాబాద్ లోని కొత్త డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద సిటీ పోలీస్ శాఖా నేతృత్వంలో పలు సాంకేతిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, డిజిపి అంజనీ కుమార్‌లు పాల్గొన్నారు. వివిధ విభాగాల టెక్నాలజీ డిస్‌ప్లే, బ్యాండ్, డాగ్ స్క్వాడ్ డిస్‌ప్లే, ఫోరెన్సిక్ సైన్స్, ఫోటో ఎగ్జిబిషన్, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో, క్రావ్ మాగా, బాంబ్ డిస్పోజల్ డ్రిల్, వివిధ కమ్యూనికేషన్ పరికరాలు, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ డెమో, మై నేషన్ స్టాల్స్, సైబర్ సెక్యూరిటీ, నార్కోటిక్ బ్యూరో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఇంజనీర్స్, సైంటిస్ట్ ఉన్నారని ఆయన అన్నారు.

Also Read : Viral: రైలు ప్రమాదంలో చనిపోయిన కొడుకు శవం కోసం వెతుకుతున్న తండ్రి.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

టెక్నాలజీ వాడకం వల్ల దేశంలో తెలంగాణ పోలీస్ నంబర్ 1 అయిందని ఆయన కితాబిచ్చారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో సాంకేతిక పరిజ్ఞానం పోలీస్ పలు విభాగాల్లో ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ వల్ల తెలంగాణలో పెట్టుబడులు వస్తున్నాయని ఆయన అన్నారు. హోం శాఖకు సీఎం కేసీఅర్ బడ్జెట్‌లో 9వేల కోట్ల కేటాయించారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుభాకాంక్షలు తెలిపారు మహమూద్‌ అలీ. అనంతరం తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ మోడల్‌ పోలీస్ దేశానికి ఆదర్శమన్నారు. తెలంగాణ పోలీస్ ఇమేజ్ ఇతర దేశాల్లో ఉందని ఆయన అన్నారు. గొప్ప పేరు సంపాదించడం ఆనందంగా ఉందని, తెలంగాణ గొప్ప పేరు వెనుక 70వేల మంది పోలీస్ అధికారుల క్రెడిట్ ఉందన్నారు.

Also Read : Odisha Train Accident: ప్రమాద సమయంలో రెండు రైళ్ల వేగం గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ

Exit mobile version