తెలంగాణ విద్యా దశాబ్ది ఉత్సవాలను రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి హోమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వం పాఠశాలలో అద్భుతంగా తీర్చిదిద్దుతుందన్నారు. ఉపాధ్యాయు వృత్తి చాలా పవిత్రమైనదని, ప్రభుత్వం బడ్జెట్లో అధిక నిధులు విద్యకు ఖర్చు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తరువాత పెద్ద ఎత్తున గురకులాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వమన్నారు. అంనతరం రాష్ట్రా విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలో అద్భుతమైన మౌలిక వసతులు మన ఊరు మనబడి మన ఊరు. ద్వారా కల్పించబడుతున్నాయి.
Also Read : Kriti Kharbanda: కిల్లింగ్ లుక్స్.. స్టైలిష్ పోజ్.. వాట్ ఎ బ్యూటీ
గురుకులాల్లో నాణ్యమైన విద్య అందించబడుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో అన్ని పాఠశాలలో పూర్తిగా మాలిక వసతులు కల్పించబడతాయి అని ఆయన అన్నారు. ఆ తరువాత ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది అద్భుతంగా నిర్వహిస్తుందని, ప్రభుత్వం హైదరాబాదును అద్భుతంగా డెవలప్ చేస్తుందన్నారు. ప్రభుత్వం ఫ్లైఓవర్ అధికంగా నిర్మించిందని, సచివాలయం మరియు అమరవీరుల స్థూపం అద్భుతంగా కట్టారు ప్రభుత్వంకు అభినందనలు తెలిపారు. డాక్టర్లు ఇంజనీర్లు తయారు కావాలంటే పాఠశాల విద్య పునాది మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం అద్భుతంగా పాఠశాలలు తీర్చిదిద్దుతుందన్నారు.
Also Read : Rashmika Mandanna: మేనేజర్ దెబ్బకి రష్మిక కీలక నిర్ణయం.. ఇక ఒంటరిగానే?