NTV Telugu Site icon

Maheshwar Reddy : మా మధ్య ఏం లేదు.. బాంబు పేల్చిన మహేశ్వరరెడ్డి

Maheshwar Reddy

Maheshwar Reddy

Maheshwar Reddy : కాంగ్రెస్ పార్టీలో పాదయాత్రల లొల్లి కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలు పోటాపోటీగా పాదయాత్రలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి పంచాయతీలు మొదలయ్యాయంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్వర్ రెడ్డి స్పందించారు. తమ మధ్య గ్రూపులు లేవని.. పార్టీలో ఐక్యంగా ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఏఐసీసీ ఆదేశాలతోనే యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా అధిష్టానం ఆదేశాల మేరకే నేతలంతా పాదయాత్రలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Cannabis : అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్.. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు

రేవంత్‌ది, తనది కాంగ్రెస్ యాత్రలేనని.. రెండూ హాత్ సే హాత్ జోడో యాత్రలేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే కుటుంబమని..పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవన్నారు. సీనియర్లు వారి అనుకూలతను బట్టి యాత్రలకు హాజరవుతారని మహేశ్వర్ రెడ్డి తేల్చేశారు. తనకు పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానన్నారు. అందరం కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్, నేతలు వున్నారని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: 300 Stones In Kidney : ఏం తాత కిడ్నీలో ఇన్ని రాళ్లు పోగేశావా..?

కాగా.. అధికారంలో ఉన్న బీఆర్‎ఎస్ సర్కార్ ప్రజలను దోచుకుతింటుందని మహేశ్వరరెడ్డి ఆరోపించారు. త్వరలోనే ఆ విషయాలన్నీ బయటపెడతానంటూ బాంబు పేల్చారు. తాను చేపట్టిన పాదయాత్రకు జనం నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. షెడ్యూల్ ప్రకారం యాత్ర సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.