NTV Telugu Site icon

MaheshBabu SRH: ఎస్ఆర్హెచ్ కెప్టెన్ తో టాలీవుడ్ సూపర్ స్టార్.. వైరల్ పిక్..

Mahesh Babu Srh

Mahesh Babu Srh

ఇద్దరు స్టార్స్ ఒక దగ్గరికి చేరితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరిని చూడడానికి వారి ఫ్యాన్స్ ఎంతో ఆనందిస్తారు. ఇకపోతే తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా పేరుగాంచిన మహేష్ బాబు అంటే టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్. అలాగే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కు కూడా చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే..

Also Read: Botsa Jhansi Lakshmi: విశాఖలో బొత్స ఝాన్సీ లక్ష్మి నామినేషన్ దాఖలు

తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కలిశారు. కాకపోతే ఇది బయట ఎక్కడో పబ్లిక్ ప్లేస్ లో కాదు. ఓ యాడ్ షూటింగ్ సంబంధించి విరిద్దరూ కలిశారు. ఈ నేపథ్యంలో వారు ఇద్దరు కలిసి కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ ముచ్చటించారు. ఈ విషయాన్ని తాజాగా ఎస్ఆర్హెచ్ కెప్టెన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు. ఇందులో భాగంగా టాలీవుడ్ ప్రిన్స్ తో ఈ మధ్యాహ్నం తాము సరదాగా గడపామని పేర్కొన్నాడు.

Also Read: Aa Okkati Adakku :‘పెళ్లి ఎప్పుడు?’, అని అడిగే వాళ్ళని కొత్త చట్టం పెట్టి లోపలేయించండి!

దీంతో హైదరాబాద్ టీం క్రికెట్ ఫ్యాన్స్, అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదివరకే మహేష్ బాబు అనేకసార్లు తనకి క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టమని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. చాలాసార్లు కూడా ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు సపోర్ట్ చేయడానికి కూడా వచ్చారు. ఇక పాట్ కమ్మిన్స్ షేర్ చేసిన ఫోటోను మహేష్ బాబు రీ ట్వీట్ చేస్తూ.. ఇది నాకు గౌరవంతో కుడైన అభిమానం అంటూ తెలుపుతూ.. తాను కూడా అతనికి అభిమానిని అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show comments