NTV Telugu Site icon

Mahesh Kumar Goud: కేంద్రం సహకరిస్తే తెలంగాణ నెంబర్ వన్ అవుతుంది..

Bomma Mahesh Kumar Goud

Bomma Mahesh Kumar Goud

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి, కేసీఆర్‌తో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ మీద ప్రేమ ఉండొచ్చు.. కానీ అభివృద్ధి విషయంలో కాళ్ళు లాగే పని చేయొద్దని సూచించారు. పదేళ్లుగా ప్రధాని దగ్గరికి వెళ్ళి.. తెలంగాణ నిధులపై చర్చ చేశారా..? అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకి ఏం ఇచ్చింది అంటే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి పదవి ఇచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ నెంబర్ వన్ అవుతుందని అన్నారు.

Read Also: BNS Srinivas: తెలుగు వారి కోసం ప్రపంచ నిపుణుల జ్ఞానాన్ని అందిస్తున్న మార్గదర్శి

మరోవైపు.. మూసీ ప్రక్షాళనకి మద్దతు లేదని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ట్రిపుల్ ఆర్ వద్దా..? స్కిల్ యూనివర్సిటీ వద్దా..? అని అన్నారు. కేసీఆర్ కులంకి చెందిన రామ్మోహన్ నాయుడిని.. తెలంగాణకి తీసుకు వచ్చి కేసీఆర్‌ను పొగిడే పని చేశారు కిషన్ రెడ్డి అని అన్నారు. ఎయిర్ పోర్టులు ఎవరిస్తారు.. సీఎం రేవంత్ మోడీని ఎన్ని సార్లు అడిగితే ఇచ్చారు ఎయిర్ట్ పోర్ట్ అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి.. మీరు తెలంగాణ బిడ్డ కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. పట్టించుకుని ముందుకు వెళ్ళాలి అనుకునే రేవంత్‌ రెడ్డిని అడ్డుకుంటున్నారు.. అభివృద్ధిని అడ్డుకుంటున్న కేసీఆర్, కిషన్ రెడ్డిలను ప్రజలు గమనిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

Read Also: IND vs AUS: సెమీ ఫైనల్స్‌లో భారత్ vs ఆస్ట్రేలియా.. పైచేయి సాధించేదెవరో!