NTV Telugu Site icon

Mahesh Kumar Goud : మునుగోడు వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉంది

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

TPCC Working President Mahesh Kumar Goud MLA Komatireddy Rajgopal Reddy Issue.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎపిసోడ్‌ హాట్‌ టాపిక్‌ గా మారింది. పార్టీ నాకు అవమానం జరిగిందటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదురించే సత్తా బీజేపీకే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు రాజగోపాల్‌ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారం అధిష్టానం దృష్టి తీసుకెళ్లారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. దీంతో అధిష్టానం ఢిల్లీకి రావాలని కబురు పెట్టడంతో.. నియోజకవర్గ పర్యటనలో ఉన్నానని అయ్యాక వస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా  రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పై వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఏఐసీసీ పరిశీలిస్తోందని ఆయన వెల్లడించారు. నిన్న కేసీ వేణుగోపాల్ తో ముఖ్య నేతలు, నల్గొండ జిల్లా నేతలు చర్చించారని, మునుగోడుపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు.

 

DK Aruna : యాదాద్రి పేరుతో వందల కోట్ల ధనాన్ని మింగారు

మునుగోడు వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉందన్నారు. మునుగోడును నల్గొండ జిల్లా నేతలు చూసుకుంటారని, కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద ఆధారపడదు..అది సమూహమని ఆయన వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి మా ఎమ్మెల్యే గా ఉన్నారు.. ఆయన వెంట కార్యకర్తలు ఉన్నారని, చాలా మంది నేతలను ఈడీ బూచితో బెదిరించి బీజేపీలోకి లాగలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ పాచికలు పారవని, అది 10 – 12 నియోజకవర్గలకే పరిమితమన్నారు మహేశ్‌ గౌడ్‌. ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో గెలుస్తామని, అది నేను చెప్పేది కాదు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అని ఆయన వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ మంత్రుల, శాసన సభ్యులు, బీజేపీకి చెందిన కీలక నేతలు మాతో టచ్ లో ఉన్నారని ఆయన తెలిపారు. వారంతా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నారని, పార్టీలో చేరికలపై నెల రోజుల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చూస్తారని ఆయన తెలిపారు.