Site icon NTV Telugu

Mahesh Kumar Goud : ఇంత అవమానాన్ని గురైన గవర్నర్ ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

ఇంత అవమానాన్ని గురైన గవర్నర్ ఇలా మాట్లాడుతుందని అనుకోలేదన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. తాజాగా ఆయన నిజామాబాద్ జిల్లాలో మాట్లాడుతూ.. ఢిల్లీ పెద్దల గైడెన్స్ ప్రకారమే గవర్నర్ ప్రసంగం సాగిందని, గవర్నర్ తన అవమానాన్ని దిగమింగుకోని మాట్లాడారని అనిపిస్తుందన్నారు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌. అంతేకాకుండా.. మేము మొదటి నుండి చెపుతున్నట్లుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ వేరు కాదని అది నిజం అయిందన్నారు. రాజ్ భవన్ లో నుండి ఉద్యోగాలు లేవని చెప్పిన గవర్నర్ ఈ రోజు లక్షలాది ఉద్యోగాలు వచ్చాయి అని ఎలా చెపుతారని ఆయన మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య ఒప్పదం గెలిచిందన్నారు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌.

Also Read : Deepak Chahar Wife: దీపక్ చాహర్ భార్యను మోసం చేసిన వ్యక్తులు..రూ.10లక్షల కోసం

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండి చేయి చూపారని ఆయన విమర్శించారు. సెక్రటేరియట్ నిర్మాణంలో హడావుడి చేయడం వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని ఆయన మండిపడ్డారు. పాత సెక్రటెరియట్‌లో అగ్ని ప్రమాదం జరిగితే ఇబ్బంది అవుతుది అనే కదా కొత్త నిర్మాణమని ఆయన అన్నారు. ఇప్పుడు ఏ కారణంతో అయితే పాత భవనం కూల్చారో అదే ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. దీనిపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే.. ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య విభేదాలు రచ్చ బహాటంగా చర్చకు వచ్చింది.

Also Read : INDvsAUS: ఆసీస్‌తో టెస్టు సిరీస్.. నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా

అయితే.. ఈ సారి అసెంబ్లీ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే జరిపేందుకు సిద్ధమవుతున్న వేళ.. హైకోర్టు జోక్యంతో సద్ధుమణిగింది. దీంతో.. ప్రభుత్వం తరుఫున గవర్నర్‌ను అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానించారు. దీంతో.. అసెంబ్లీలో గవర్నర్‌ తమిళిసై ప్రసంగంపై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినదే గవర్నర్‌ చదవడంతో.. కాంగ్రెస్‌ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version