టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయా భరద్వాజ్‌ను ఇద్దరు వ్యక్తులు మోసం చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె నుంచి రూ.10 లక్షలు తీసుకున్న ధ్రువ్ పరేక్, కమలేశ్ పరేక్ తిరిగి ఇవ్వమంటే బెదిరిస్తున్నారని ఓ కేసు నమోదైంది. అయితే మోసం చేసిన వారిద్దరికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వ్యాపారానికి సంబంధించి జయ రూ. 10 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ తిరిగి అడిగితే చంపేస్తామని బెదిరించారని తెలిపారు.ఈ విషయమై చాహర్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Also Read: INDvsAUS: ఆసీస్‌తో టెస్టు సిరీస్.. నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా
దీపక్ చాహర్ కుటుంబం ఆగ్రాలో నివసిస్తోంది. దీపక్, జయల వివాహం గతేడాది జూన్ 1న జరిగింది. ఈ ఇద్దరి పెళ్లికి దగ్గరి బంధువులతో పాటు పలువురు స్నేహితులు హాజరయ్యారు. దీపక్, జయ ఇద్దరు చాలాకాలం ప్రేమించుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలక బౌలర్‌గా సేవలందిస్తున్నాడు చాహర్. గాయం కారణంగా కొంత కాలంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. దీపక్ తన చివరి వన్డే మ్యాచ్‌ను గతేడాది డిసెంబర్‌లో, చివరి టీ20 మ్యాచ్ అక్టోబర్‌లో ఆడాడు.
Also Read: WPL 2023: విమెన్స్ ఐపీఎల్ తొలి మ్యాచ్ ఈ జట్ల మధ్యే!