INDvsAUS: ఆసీస్‌తో టెస్టు సిరీస్.. నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విజయం కోసం భారత్-ఆస్ట్రేలియా జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారత గడ్డపై ఈసారి ఎలాగైనా సిరీస్ గెలిచే తీరాలన్న కసితో ఆసీస్ ఉండగా.. మరోసారి తన రికార్డును కొనసాగించాలని చూస్తోంది రోహిత్‌సేన. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న తొలిటెస్టు కోసం ఇప్పటికే నాగ్‌పూర్ చేరుకున్న ఇండియా నెట్ ప్రాక్టీస్‌లో బీజీబీజీగా గడుపుతోంది. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా త్రోడౌన్ స్పెషలిస్టులతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
And the practice continues….#INDvAUS https://t.co/qwRUSxcLBY pic.twitter.com/5mECrOjWiG
Also Read
- President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్‌పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
- Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
- CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
- Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
— BCCI (@BCCI) February 3, 2023
అదే విధంగా భారత వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా, యువ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కూడా చాలా సమయం నెట్స్‌లోనే గడిపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్‌లో షేర్ చేసింది. మరోవైపు ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా.. బెంగళూరు సమీపంలోని ఆలూర్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. ఇండియన్ పిచ్‌లకు తగినట్లు పిచ్ తయారు చేసుకుని మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో ఈ సిరీస్ హోరాహోరీగా జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: WPL 2023: విమెన్స్ ఐపీఎల్ తొలి మ్యాచ్ ఈ జట్ల మధ్యే!
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్
తాజావార్తలు
-
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
-
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
-
Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
-
President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్‌పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..