NTV Telugu Site icon

Mahesh Kumar Goud : ఈ దేశానికి భవిషత్తు రాహుల్ గాంధీ…

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

బీజేపి నేతలు రాహుల్ గాంధీ పై వివాదాస్పద వాఖ్యలను నిరసిస్తూ హన్మకొండలోని అంబేద్కర్ జక్షన్ వద్ద వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనకు ముఖ్యఅతిధిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ, బీజేపీ పార్టీ వాళ్లు.. రాహుల్ గాంధీ కుటుంబం కాలిగొట్టికి కూడా సరిపోరన్నారు. కొందరు వెధవలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన ఫైర్‌ అయ్యారు. కుటుంబాలను అవమానించటం తప్ప ఏమి తెలియదు బీజేపీ పార్టీ వాళ్లకి, ఒకవేళ మేము అడుగులాంటే నరేంద్ర మోడీ మీ తల్లి గురించి మీ కుటుంబం గురించి అడగమా అన ఆయన మండిపడ్డారు. వరంగల్ వేదిక ద్వారా గట్టిగా ప్రశ్నిస్తునాం మీ నాయకులు మాటలను మీరు సమర్థిస్తున్నారా.. ఒకవేళ మీరు సమర్థిస్తే బీజేపీ పార్టీ నమారూపాలు లేకుండా పోతదని ఆయన అన్నారు.

Kolkata: వైద్యురాలి హత్యాచార కేసులో బెంగాల్ పోలీసులపై సీబీఐ సంచలన ఆరోపణలు

అనంతరం.. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. మన దేశ దౌర్భాగ్యం ఏమిటంటే ఈ రోజు గాడ్సే వారసులు మన దేశాన్ని పాలిస్తున్నారని, ఈ దేశానికి భవిషత్తు రాహుల్ గాంధీ అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీని మీ నానమ్మ గతి పడుతుంది అనడం చాలా నేరమని, మోడీ, అమిత్ షా ఎప్పుడైన జైలుకీ పోయారా, కనీసం వాళ్ళ ఇళ్లలో కుక్క ఐనా దేశం కోసం చనిపోయిందా అని ఆయన మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లో ఈ రోజు బీజేపీ తుడిచి పెట్టుక పోతుందని, హర్యానా లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందన్నారు. గాంధీ కుటుంబం అంటే త్యాగాల కుటుంబం అని, 1989 లో రాజీవ్ గాంధీ మీద కుట్ర జరుగుతుంది అని అనుమానం వచ్చి కేంద్రం కీ తెలిపిన భద్రత ఇవ్వకపోవడం వల్లనే మనం రాజీవ్ గాంధీ నీ కోల్పోయామన్నారు.

Bhatti Vikramarka: మిగిలిన రాష్ట్రాల కంటే అద్భుతమైన MSME పాలసీ మనది

అంతేకాకుండా..’ప్రజాస్వామ్యం మీద విలువ లేకుండా బీజేపీ వ్యవహరిస్తుంది, గాడ్సే విధానాలను అమలు చేస్తున్న పార్టీ వాళ్ళు తీవ్రవాదులుగా మాట్లాడుతున్నారు. మీ నానమ్మకు పట్టిన గతే పడుతుందనడం ఎంతవరకు సమంజసం. ఇందిరా గాంధీని తీవ్రవాదులు ఎందుకు ప్రాణాలు తీశారు. దేశ భద్రతను కాపాడే ప్రయత్నం చేస్తే తీవ్రవాదులు హతం చేశారు. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇప్పుడు ఒక శక్తిగా మారారు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే నాయకుకుడు ఆయన. గాంధీ కుటుంబంలో ఎన్నో త్యాగాలు చేశారు. ఇతర రాష్ట్రంలో బిజెపి నేతలు మాట్లాడుతున్న మాటలకు కారణాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో బిజెపి తుడిచి పెట్టకపోతుంది. మహారాష్ట్రలో ఏకనాథ శివసేన తుడిచిపెట్టకపోతుంది. హర్యానాలో మరోసారి కాంగ్రెస్ గెలవబోతోంది. ఈ ఓటమికి కారణం తోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. త్యాగాలు చేసిన కుటుంబంపై నిందలు మోపుతుంటే చూస్తూ ఊరుకో. తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలోని వాళ్లను తీవ్రవాదులుగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసం. మీ ప్రాణాలు తీస్తామని హెచ్చరిస్తున్న పోలీసులు వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.

రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందని పలు సంస్థలు ఏజెన్సీలు హెచ్చరిస్తున్న ఆయన భద్రత ఎందుకు పెంచడం లేదు ఇందులో ఏమన్నా కుట్ర ఉందా ఆలోచించాలి. బీ జె పి పార్టీ మాట్లాడితే కులం,మతం అని మాట్లాడుతుంది… ఈ రోజు ప్రజలను అడుగుతున్న మన పిల్లల భవిష్యత్తు మనం కర్భ చేసుకుందామా… ప్రజలు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి, ఇలా మాట్లాడే వారు మనకు వద్దు.. మతం, కులం వాళ్ళ మనకు కుడు రాదు ఏమి రాదు , ప్రజలు గ్రహించాలి… ప్రధాని మోడీని నేను ఈ రోజు అడుగుతున్న మీ నాయకులు ఇలా తీవ్రవాదులుగా మాట్లాడుతుంటే మీరు నిజంగా ప్రజల మనిషి ఐతే.. రాహుల్ గాంధీ మీద తీవ్రవాదులుగా మాట్లాడిన వారి పై కేసు లు పెట్టి జైలు కీ పంపించాలి… వరంగల్ నుండి నాయిని రాజేందర్ రెడ్డి ఆ నాలుగురు పై కేసు పెట్టాలని మనవి చేస్తున్న.. ఆ నలుగురి నీ తక్షణమే జైల్లో పెట్టించాలి’ అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.