NTV Telugu Site icon

Mahesh-Trivikram: జనవరి నుంచి నాన్ స్టాప్‌గా మహేశ్, త్రివిక్రమ్ సినిమా

Mahesh Babu

Mahesh Babu

Mahesh-Trivikram: సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న సినిమా షూటింగ్ జనవరి నుంచి నాన్ స్టాప్ గా జరగబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పూజహేగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పి.ఎస్. వినోద్ ఛాయాగ్రహణ బాధ్యతను నిర్వర్తించే ఈ సినిమాకు ప్రకాశ్ ఆర్ట్ డైరక్టర్ కాగా నవీన్ నూలి ఎడిటర్. హారికాహాసిని పతాకంపై యస్. రాధాకృష్ణ నిర్మించే ఈ సినిమాపై ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి.

Siva Karthikeya Marina Movie: 17న రానున్న ‘మెరీనా’

ఎట్టకేలకు నిర్మాతలు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి నాన్ స్టాప్ గా జరిగే విషయాన్ని ప్రకటించారు. మహేశ్, త్రివిక్రమ్ కలయికలో ఇంతకు ముందు ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు తెరకెక్కాయి. ఇది మూడో సినిమా. అలాగే ‘అల వైకుంఠపురములో’ తర్వత త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ముందు రెండు సినిమాలతో సూపర్ హిట్ అందుకోని మహేశ్, త్రివిక్రమ్ ఈ మూడో సినిమాతో అయినా ఘన విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.