Siva Karthikeya Marina Movie: ఇటీవల కాలంలో తెలుగు వారికి బాగా దగ్గరైన తమిళ కథానాయకుడు శివకార్తికేయన్. ఆయన తమిళంలో నటించిన ‘మెరీనా’ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు యస్.వి.ఆర్ మీడియా అధినేత సి.జె. శోభ. శివకార్తికేయన్ సరసన ఒవియా నాయికగా నటించిన ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 17న ‘మెరీనా’ను తెలుగులో విడుదల చేయబోతున్నామని, చక్కటి కామెడీ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట రెండు స్టేట్ అవార్డులతో పాటు ప్రేక్షకుల రివార్డులను పొందిందంటున్నారు నిర్మాత శోభ. కనువిందుచేసే ఛాయాగ్రహణం ఒక హైలైట్ అయితే సంగీతం మరో హైలైట్ అని, తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందన్ననమ్మకంతో ఫ్యాన్సీ రేట్ కు కొని విడుదల చేస్తున్నామని అంటున్నారామె. ట్రైలర్ ను విడుదల చేస్తున్నామని, అలాగే పాటలను కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆవిష్కరిస్తామని చెప్పారామె.