Site icon NTV Telugu

Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లా.. ‘వారణాసి’ నుంచి కళ్లు చెదిరే అప్‌డేట్!

Varanasi

Varanasi

Varanasi: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ మూవీలో చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ చిత్రం నుంచి ఎలాంటి న్యూస్ బయటికి వచ్చిన అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వైరల్ న్యూస్ ఏంటో తెలుసా.. వారణాసి సినిమాలో ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్ల బడ్జేట్ అయ్యిందంట.

READ ALSO: సగం ధరకే Havells వాటర్ హీటర్..! ఫీచర్లు అదరిపోయాయి.!

వారణాసిలో త్రేతాయుగ ఎపిసోడ్‌ 25 నిమిషాలు ఉంటుందని సమాచారం. ఈ 25 నిమిషాల సీక్వెన్స్‌కు ఏకంగా రూ.300 కోట్లు అయ్యిందని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ ఎపిసోడ్ చిత్రీకరణ కోసం జక్కన్న భారీ సెట్లు, వరల్డ్ క్లాస్ VFX యూజ్ చేస్తున్నట్లు సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సూపర్ స్టార్ సరసన హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ నటుడు పృద్వి రాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

READ ALSO: iBOMMA Ravi bail: ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు..! కానీ ఆ కండిషన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Exit mobile version