NTV Telugu Site icon

Mahesh Babu: దట్ ఈజ్ మహేష్.. అభిమాని పిల్లల్ని దత్తత తీసుకోని ఆపై..

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అనిపించుకునేలా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేపించడం, అలాగే కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం లాంటి అనేక సేవా కార్యక్రమాలను ఆయన నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి 1000 మందికి పైగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను ఉచితంగా చేయించారు. అంతేకాదు మహేష్ బాబు తన అభిమానులు ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందుల్లో కానీ., ఏదైనా కష్టాల్లో ఉన్న కానీ.. మహేష్ వెంటనే స్పందిస్తాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన వీరాభిమానికి అండగా నిలిచాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Vangalapudi Anitha: పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకొండి.. పోలీసులకు హోం మంత్రి వార్నింగ్

మోపిదేవి పెదప్రోలులో కాకర్లపూడి రాజేష్ అని వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబుకి వీరాభిమాని. ఆయనకి ఓ భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజేష్ కు మహేష్ బాబు పై ఎంత అభిమానం అంటే తన ముగ్గురు కుమారులకు కూడా మహేష్ బాబు నటించిన సినిమా పేర్లను పెట్టేసాడు. రాజేష్ మొదటి కొడుకు పేరు అర్జున్, రెండో కొడుకు పేరు అతిథి, మూడో కొడుకు పేరు ఆగడు. ఇలా ఏ సినిమా రిలీజ్ సమయంలో కొడుకు పుట్టినట్లయితే అందుకు సంబంధించిన పేరును నామకరణం చేసేసాడు. అసలు విషయంలోకి వెళ్తే.. మహేష్ అభిమాని రాజేష్ ప్రస్తుతం కిడ్నీ ఫెయిల్ సంబంధించిన వ్యాధితో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిది పేద కుటుంబం కావడంతో తన ముగ్గురు కొడుకులు చదువు మానేసి పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

T20 World Cup 2024: ‘సూపర్ 8’ భారత్ షెడ్యూల్ ఇదే!

ఇందులో పెద్దకొడుకు చెప్పుల షాపులో పనిచేస్తుండగా.. మరో ఇద్దరు కుమారులు వేరే పనులలో ఉన్నారు. అయితే ఈ విషయంపై ఇదివరకు ఆ పిల్లలు చదివిన పాఠశాల ప్రిన్సిపల్ మహేష్ బాబు అభిమానులకు ఈ విషయాన్ని తెలిపారు. దాంతో ఆ విషయం కాస్త మహేష్ బాబు వద్దకు చేరడంతో., మహేష్ బాబు ఫౌండేషన్ టీం ద్వారా సభ్యులు పెద్దప్రోలుకు వెళ్లి అక్కడ రాజేష్ పిల్లలను మోపిదేవిలోని ఓ పాఠశాలలో జాయిన్ చేయించి డబ్బులు కట్టారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం వారి చదువుకు అవసరమయ్యే డబ్బులు మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి వస్తాయని., వాళ్ళని పూర్తిగా చదివిస్తామని చెప్పినట్లు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో మరోసారి మహేష్ బాబును సోషల్ మీడియాలో అభిమానులు, అలాగే నెటిజెన్లు పొగడ్తలతో ముంచేస్తున్నారు.