సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ (SSMB29) కోసం ఆయన చేస్తున్న మేకోవర్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో తాజాగా హాలీవుడ్ మీడియాతో మాట్లాడిన మహేష్ బాబు “ఇండియాలో నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ హైదరాబాద్ చికెన్ బిర్యానీ” అని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.
సాధారణంగా మహేష్ బాబు తన ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ, అప్పుడప్పుడు చేసే ‘చీట్ మీల్స్’లో ఆయన మొదటి ఛాయిస్ మన హైదరాబాదీ బిర్యానీ అని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. “బిర్యానీ అంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్” అని చెప్పే హైదరాబాద్ ప్రజలు.. ఇప్పుడు సూపర్‌స్టార్ కూడా తమ జట్టులోనే ఉన్నారని సంబరపడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు “అందుకే మీరు సూపర్ సామి.. టేస్ట్ లో కూడా మీది మన హైదరాబాదీ స్టైలే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంటేనే ఒక పద్ధతిగా ఉండే లైఫ్ స్టైల్, స్ట్రిక్ట్ డైట్ గుర్తొస్తాయి.