Site icon NTV Telugu

Businessman Re-Release : మహేశ్ అభిమానుల అతి ఉత్సాహం.. థియేటర్ ముందే బైక్ దగ్ధం

Bisnessman Re Relice

Bisnessman Re Relice

మహేశ్ బాబు నటించిన ‘బిజినెస్‌మ్యాన్’ సినిమా నవంబర్ 29న మరోసాని రీరిలీజ్ అయ్యింది. దీంతో థియేటర్‌ల వద్ద ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక లోని, శ్రీ వెంకటేశ్వర థియేటర్ ముందు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. థియేటర్ ఎదుట మహేశ్ అభిమానులు కొంత మంది బైకుల ఎక్సలేటర్ పెంచి రౌండ్లు వేయడం ప్రారంభించారు. ఈ సమయంలో ఒక బైక్ అధిక వేడిని తట్టుకోలేక మంటలు రావడంతో, స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ..

Also Read : Rajendra Prasad: మరోసారి నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. బ్రహ్మానందం పై బోల్డ్ కామెంట్!

చూస్తుండగానే మంటలు ఎక్కువయ్యాయి. స్థానికులు, ఫ్యాన్స్ మంట‌లు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ  కొన్ని నిమిషాల్లోనే ఆ బైక్ పూర్తిగా ద‌గ్ధమైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ థియేటర్ ఎదుట ఒక్కసారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ప్రమాదాలు తప్పవని, ఇలాంటి స్టంట్లు చేయరాదని సూచించారు. దేశవ్యాప్తంగా మహేశ్ బాబు పట్ల అభిమానులు చూపే ప్రేమ అందరికీ తెలిసినదే. కానీ ఇలాంటి ప్రమాదాలు ఆ పూర్తి సంబరాల మూడ్‌ను చెడగొడతాయి. తాజా సంఘ‌ట‌న‌తో పోలీసులు థియేటర్ల వద్ద భద్రత చర్యలు మరింత పెంచారు.

Exit mobile version