Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Kachori Recipe: రోడ్ సైడ్ ఫుడ్ ఇష్టంగా లాగించేస్తుంటాం.. వాటితో అనేక మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని కూడా కొన్ని ఘటనలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.. అయితే, చాట్ల గురించి మాట్లాడితే రాజ్ కచోరీ పేరు తప్పకుండా వస్తుంది. చాట్లకే రాజుగా పేరొందిన ఈ వంటకం బయటకు కరకరలాడుతూ, లోపల రుచికరమైన స్టఫింగ్తో నిండిపోయి ఉంటుంది. బంగాళాదుంపలు, శనగలు, పెరుగు, తీపి-కారం చట్నీలు కలిసిన రాజ్ కచోరీ రుచి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే, మార్కెట్లో లభించే రాజ్ కచోరీ ఖరీదైనదిగా ఉండటమే కాకుండా, ఎక్కువ నూనె మరియు నిల్వ పదార్థాలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లోనే హల్వాయి స్టైల్లో రాజ్ కచోరీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
రాజ్ కచోరీకి కావలసిన పదార్థాలు
రాజ్ కచోరీకి ఏం కావాలంటే..
* బొంబాయి రవ్వ – 1 కప్పు
* మైదా – 3 టేబుల్ స్పూన్లు
* నెయ్యి లేదా నూనె – 2 టేబుల్ స్పూన్లు
* బేకింగ్ సోడా – ఒక చిటికెడు
* ఉప్పు – అర టీస్పూన్
* గోరువెచ్చని నీరు – అవసరమైనంత
* వేయించడానికి నూనె
Also Read
- Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
- Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ 'ఆలూ సమోసా'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
- Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ "దద్దోజనం" కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
- How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
స్టఫింగ్ కోసం:
* ఉడికించిన బంగాళాదుంపలు – 2
* ఉడికించిన శనగలు లేదా మినుములు – 1 కప్పు
* ఉడికించిన మొలకలు – అర కప్పు
* దహీ భల్లా లేదా పకోడీలు – 4 నుంచి 5
టాపింగ్ కోసం:
* చిలికిన పెరుగు – 2 కప్పులు
* తీపి చింతపండు చట్నీ – 1 కప్పు
* పచ్చి చట్నీ – 1 కప్పు
* జీలకర్ర పొడి, కారం, చాట్ మసాలా, నల్ల ఉప్పు – తగినంత
* ఆపిల్ ముక్కలు – అర కప్పు
* దానిమ్మ గింజలు – అర కప్పు
* కొత్తిమీర – అలంకరణకు
కచోరీ పిండి తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో రవ్వ, మైదా, ఉప్పు, బేకింగ్ సోడా మరియు నూనె వేసి చేతులతో బాగా కలపాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని కొద్దికొద్దిగా పోస్తూ మెత్తటి పిండిని కలపాలి. రవ్వ నీటిని ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి పిండిని కొంచెం మెత్తగా ఉంచాలి. ఇప్పుడు ఈ పిండిని తడి గుడ్డతో కప్పి 20 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టాలి.
కచోరీలను తయారు చేసి వేయించడం
పిండి నానిన తర్వాత మళ్లీ బాగా కలిపి మధ్యస్థ పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుని నూనె సహాయంతో పూరీ కంటే కొద్దిగా పెద్దగా ఒత్తాలి. అంచులు పలుచగా, మధ్య భాగం కొంచెం మందంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి కచోరీలను నెమ్మదిగా వేయించాలి. కచోరీ పూర్తిగా ఉబ్బిన తర్వాత మంటను తగ్గించి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇలా చేస్తే కచోరీలు కరకరలాడుతూ వస్తాయి.
రాజ్ కచోరీ స్టఫింగ్ విధానం
ఒక కచోరీని తీసుకుని మధ్యలో చిన్న రంధ్రం చేయాలి. అందులో ముందుగా దహీ భల్లా ముక్కలు వేసి, తర్వాత బంగాళాదుంపలు, శనగలు, మొలకలు నింపాలి. ఆపై తీపి పెరుగు పుష్కలంగా పోయాలి. ఇప్పుడు పచ్చి చట్నీ, చింతపండు చట్నీ వేసి, పైన జీలకర్ర పొడి, కారం, చాట్ మసాలా, నల్ల ఉప్పు చల్లాలి. ఇక, చివరగా ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, కొత్తిమీరతో అలంకరించాలి. వెంటనే వడ్డిస్తే కచోరీ కరకరలాడే రుచి అలాగే ఉంటుంది.
ఇంట్లోనే రాజసం ఉట్టిపడే చాట్
ఈ విధంగా ఇంట్లోనే సులభంగా రాజ్ కచోరీ తయారు చేసుకుని కుటుంబ సభ్యులతో ఆస్వాదించవచ్చు. బయట దొరికే వాటిలాగే కరకరలాడే రుచితో పాటు ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. సాయంత్రం స్నాక్‌గా లేదా ప్రత్యేక సందర్భాల్లో ఈ చాట్ అందరినీ ఆకట్టుకుంటుంది.
తాజావార్తలు
-
Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
-
CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
-
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!