NTV Telugu Site icon

Jharkhand: జార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్..

Ms Dhoni

Ms Dhoni

జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరించనున్నారు. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో తన ఫోటోను ఈసీ వినియోగించుకునేందుకు ధోనీ ఓకే చెప్పారని పేర్కొన్నారు. ఓటర్లలో ఓటు హక్కుపై చైతన్యం కలిగించేందుకు ధోనీ కృషి చేస్తారని భావిస్తున్నామని ఆయన తెలిపారు.

Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 31న వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు

స్వీప్‌ (సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌) కార్యక్రమంలో భాగంగా ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నారు. కాగా.. త్వరలోనే జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 81 స్థానాలకు నవంబరు 13, 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా.. ఈనెల 25న శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈసారి ఎన్నిక‌ల కోసం 29,562 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నిక‌ల క‌మిష‌న్ వెల్లడించింది.

Read Also: Hyderabad Metro: రాబోయే నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ పూర్తి?

Show comments