Site icon NTV Telugu

Non Veg : హైదరాబాద్‌లో రేపు నాన్‌ వెజ్‌ షాపులు బంద్‌.. ఎందుకంటే..!

Meat Shops

Meat Shops

Non Veg : మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్బంగా రేపు (జనవరి 30) హైదరాబాద్ నగరంలో అన్ని మాంసం దుకాణాలు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు గాంధీ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని మేక, గొర్రెల మండిలు, మాంసం దుకాణాలను మూసివేయాలని పేర్కొన్నాయి.

ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరించారు. మాంసం దుకాణాలు తెరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కూడా ఆదేశాలు ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో సహకరించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతిపిత మహాత్మా గాంధీ అహింస మార్గాన్ని అందరూ పాటించాలని, హింసాత్మక చర్యలను చేపట్టరాదని హెచ్చరికలు జారీ చేశారు.

అలాగే, ఈ ఉత్తర్వులు రెండు తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) కూడా అమలులో ఉంటాయి. మహాత్మా గాంధీ ఎల్లప్పుడూ అహింసా మార్గాన్ని అనుసరించాలని, హింస లేకుండా ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన నమ్మిన సంగతి తెలిసిందే. ఆయన తన జీవితంలో సత్యం, అహింస, దయ, సానుభూతిని ఆయుధాలుగా తీసుకుని దేశానికి స్వతంత్రత సాధించారు.

20వ శతాబ్దంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకించి మహాత్మా గాంధీ చేసిన పోరాటం భారతదేశానికి స్వాతంత్య్రం అందించింది. ఆయన కుల మత భేదాలను అనుసరించకుండా సమాజంలో సమానత్వాన్ని అందించాలని, సత్యం మరియు అహింసతో కూడిన జీవన విధానాన్ని ప్రతిపాదించారు.

Vishwak Sen: విశ్వక్ సేన్ దెబ్బకి సినిమా క్యాన్సిల్?

Exit mobile version