NTV Telugu Site icon

Maharashtra Shocker: బిల్డింగ్‌పై నుంచి ప్రియురాలిని తోసేసి హత్య..

Maharashtra Shocker

Maharashtra Shocker

Maharashtra Shocker: మహారాష్ట్ర నేవీ ముంబైలో యశశ్రీ హత్య ఘటన మరవకముందే, సతారాలో ప్రియుడి చేతిలో మరో యువతి హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. యువతిని ఆమె ప్రియుడు బిల్డింగ్‌పై నుంచి తోసేసి హత్య చేశాడు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. నిందితుడిని ధ్రువ్ చిక్కర్‌గా గుర్తించారు. మృతిచెందిన యువతి ఆరుషి మిశ్రాగా పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ కూడా కరాడ్‌లోని కృష్ణ మెడికల్ కాలేజీలో చదువుతున్నారు.

Read Also: MS Dhoni: ధోనీని ‘తల ఫర్ ఎ రీజన్’ అని ఎందుకు పిలుస్తారు?.. దాని వెనుక కథను చెప్పిన మహి!

పోలీసుల కథనం ప్రకారం.. హర్యానా సోనిపట్‌కి చెందిన ధ్రువ్, బీహార్ ముజఫర్ నగర్‌క్ి చెందిన ఆరుషితో మూడేళ్ల పరిచయం ఉంది. వారిద్దరు సతారాకు వెళ్లే ముందు ఢిల్లీలో కలిసి చదువుకున్నారు. ఘటన జరిగిన రోజు రాత్రి ధృవ్, ఆరుషి మధ్య తీవ్ర వివాదం ఏర్పడింది. ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని అనుమానించిన ధృవ్, ఆవేశంతో భవనం మూడో అంతస్తు నుంచి కిందికు తోసేశాడు. భవనం నుంచి పడి ఆరుషి మరణింది. ఘర్షణ సమయంలో ధ్రువ్ గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు నవీ ముంబైలో ఇదే తరహాలో 20 ఏళ్ల యశశ్రీ షిండే హత్యకు గురైంది. ఆమె ప్రియుడు దావూద్ షేక్ కత్తితో పొడిచి హత్య చేశాడు. గత కొంత కాలంగా దావూడ్, యశశ్రీని వేధిస్తున్నాడు. ఆమె ప్రైవేట్ ఫోటోని ఫేక్‌బుక్‌లో పోస్ట్ చేసి, దానిని తొలగించాలంటే తనని కలవాలని నవీ ముంబైకి రప్పించి హత్య చేశాడు.

Show comments