Site icon NTV Telugu

CM KCR : సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్ర నేతలు భేటీ..

Cm Kcr

Cm Kcr

బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తో మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు, సీనియర్ నాయకులు శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్ల పథకాలపై చర్చించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ వివరాలను సీఎంను అడిగి నేతలు తెలుసుకున్నారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందడాన్ని మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎంపీలు, సీనియర్ నేతలు ఆహ్వానించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ వంటి ప్రత్యామ్నాయ ప్రగతి కాముక రాజకీయ నాయకత్వం నేడు ఎంతగానో అవసరం ఉందన్నారు మహారాష్ట్ర నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read : Ashwini Vaishnav : పేదలు లేకుండా ఇండియా కనిపించబోతుంది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్

బీఆర్ఎస్ పార్టీ విధివిధానాల గురించి వారు సుదీర్ఘంగా చర్చించారు. తాము పార్టీలో చేరడానికి తమ సంసిద్ధతను వ్యక్తపరిచారు నేతలు. సీఎం కేసీఆర్ తో భేటీ అయిన వారిలో.. ఛత్తీస్ ఘడ్ కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్య ప్రదేశ్ బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, చత్తీస్ ఘర్ సారంగద్ మాజీ మంత్రి డాక్టర్ చబ్బీలాల్ రాత్రే, గడ్చిరోలి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పసుల సమ్మయ్యపోచమ, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్ లు ఉన్నారు.

Also Read : Kohli vs Rohit: కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు నిజమే: మాజీ కోచ్ శ్రీధర్

Exit mobile version