Site icon NTV Telugu

Devendra Fadnavis: నేడు మోడీ, అమిత్ షాతో ఫడ్నవీస్ భేటీ.. రాజీనామాపై చర్చ..!

Fadnavis

Fadnavis

Devendra Fadnavis: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైన తర్వాత తనకు అప్పగించిన ఉపముఖ్యమంత్రి పదవిని వదిలి పెట్టి.. ఆ తర్వాత తన మొత్తం సమయాన్ని అసెంబ్లీ ఎన్నికల కోసం కేటాయించాలనుకుంటున్నట్లు ఆయన సూచించారు. ఇందులో భాగంగానే, ఈ ఏడాది అక్టోబర్- నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి రాజీనామా చేసి పార్టీ కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.

Read Also: Sharwanand: సీనియర్ నటి కాళ్లు మొక్కిన హీరో శర్వానంద్‌.. వీడియో వైరల్!

అయితే, బుధవారం రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులేతో సహా, ఫడ్నవీస్ మద్దతుదారులు అలాంటి చర్య తీసుకోవద్దని ఆయనను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే తాను ప్రభుత్వానికి రాజీనామా చేసి పార్టీ కోసం పని చేయాలని భావిస్తున్నట్లు ఫడ్నవీస్ తెలిపారు.

Read Also: Mexico: రైలుతో సెల్ఫీ తీసుకోవాలని అత్యుత్సాహం.. ప్రాణాలు విడిచిన మహిళ..!

కాగా, ఈ లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ కేవలం 9 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. 2019లో సాధించిన 23 సీట్ల కంటే ఇది చాలా తక్కువ అని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్‌ భావిస్తున్నారు. ఇక, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఢిల్లీ చేరుకోవడానికి ముందు బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కూడా బీజేపీ అగ్రనేతలతో గురువారం సమావేశం కావడం గమనార్హం. గత కొంత కాలంగా వీరి ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఈసారి కమలం పార్టీ తీవ్ర స్థాయిలో నస్టపోయింది.

Exit mobile version