మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూణె పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ.138 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించారు. టెంపోలో ఈ బంగారం దొరికింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున జిల్లాల సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. చెక్‌పాయింట్‌లో తనిఖీ చేయగా ఈ బంగారం దొరికింది. ముంబై నుంచి టెంపో డ్రైవర్ బంగారాన్ని తీసుకెళ్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 138 కోట్ల విలువైన బంగారం ఎవరిది? దీనిపై పోలీసులు, ఆదాయపన్ను శాఖ బృందాలు సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయి.
READ MORE: Allu Arjun: అల్లు అర్జున్‌కి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు
సతారా రోడ్డుపై పోలీసుల చర్య:
పూణె పోలీసులు సతారా రోడ్డులో పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్నారు. ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా.. రూ.138 కోట్ల విలువైన బంగారం రికవరీ కావడం కలకలం రేపింది. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు పూణె పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రూ.138 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. నగలు నింపిన తెల్లటి బ్యాగు కనిపించింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
READ MORE:US President salary: అమెరికా అధ్యక్షుడికి ఏడాదికి ఎంత సాలరీ.? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి..?