మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూణె పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ.138 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించారు. టెంపోలో ఈ బంగారం దొరికింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున జిల్లాల సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.