Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth Varma’s Mahakali Movie Release Date: ‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU)ను మరింత విస్తరించే పనిలో ఉన్నారు. విభిన్నమైన కథలు, భారతీయ పురాణాలు, సూపర్ హీరో కాన్సెప్ట్స్‌ను కలిపి సరికొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టిస్తున్న ఆయన.. ‘జై హనుమాన్’తో పాటు ‘మహాకాళి’ ప్రాజెక్ట్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మహాకాళి ప్రాజెక్ట్‌కు ప్రత్యేక స్థానం ఉండబోతోంది.
భారతీయ సినిమా చరిత్రలోనే తొలి ఫీమేల్ సూపర్ హీరో చిత్రంగా మహాకాళి సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇప్పటివరకు సూపర్ హీరో కథల్లో పురుష పాత్రల ఆధిపత్యం ఎక్కువగా కనిపించగా.. మహాకాళిలో కాళీదేవి స్ఫూర్తితో స్త్రీ శక్తిని అత్యంత శక్తివంతంగా ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నారు. ఆగస్టు 24న మహాకాళి మాస్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ గ్లింప్స్‌లో సినిమాకు సంబంధించిన విజువల్స్, కథా ప్రపంచం, పాత్రలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
- Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
- Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
- Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈరోజు మహాకాళి రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఈ సినిమా బరిలోకి దిగనుంది. 2027 జనవరి 8న మహాకాళి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. రవితేజ నటించిన ‘ఇరుముడి’ మార్నింగ్ షో అనంతరం మీడియాకు మహాకాళికి సంబంధించిన ప్రత్యేక టీజర్‌ను ప్రదర్శించారు. గూస్బంప్స్ తెప్పించేలా ఈ టీజర్‌ను కట్ చేశారు. టీజర్‌లోని విజువల్స్, కాన్సెప్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ‘హనుమాన్’తో సూపర్ హీరో జానర్లో తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ‘మహాకాళి’తో స్త్రీ శక్తిని సూపర్ హీరో ప్రపంచంలో ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
-
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
-
Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
-
Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క