NTV Telugu Site icon

Crime: కిరాతకం.. సెంట్‌ కొట్టుకుని బయటకు వెళ్తున్నందుకు భార్యను కాల్చి చంపిన భర్త

Madhyapradesh

Madhyapradesh

Madhyapradesh Crime: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణం జరిగింది. సుగంధ ద్రవ్యం(Perfume) చల్లుకుని బయటికి వెళుతున్న భార్యతో జరిగిన గొడవలో ఓ వ్యక్తి తన భార్యపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ఘటన అనంతరం ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.

అసలేం జరిగిందంటే.. బిజోలి ఠాణా పరిధిలోని గణేష్‌పురలో నివాసముంటున్న నీలం జాతవ్‌కు ఎనిమిదేళ్ల క్రితం మహేంద్ర జాతవ్‌ అనే వ్యక్తితో వివాహమైంది. నేర చరిత్ర (దొంగతనం కేసుల్లో ప్రమేయం) ఉన్న మహేంద్ర జాతవ్ జైలు పాలయ్యాడు. ఆ తర్వాత నీలం తన తల్లిదండ్రులతో కలిసి జీవించడం ప్రారంభించింది. నాలుగు సంవత్సరాల శిక్ష అనుభవించిన తర్వాత మహేంద్ర ఒక సంవత్సరం క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం అతను తన భార్యతో ఆమె తల్లిదండ్రుల ఇంటిలో నివసించడం ప్రారంభించాడు. శనివారం నీలం తన ఇంటి నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతుండగా.. మహేంద్ర ఆమెను పెర్ఫ్యూమ్ ధరించడం, చాలా దుస్తులు ధరించడం గురించి ప్రశ్నించాడు, ఇది దంపతుల మధ్య వాగ్వాదానికి దారితీసింది.

Also Read: Extramarital Affair: చెన్నైలో దారుణం..మహిళ ప్రాణం తీసిన అక్రమ సంబంధం..

కొద్దిసేపటికే వారిద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. కోపంతో మహేంద్ర తుపాకీని తీసి తన భార్య ఛాతీపై కాల్చాడు. ఆమె అక్కడికక్కడే నేలపై పడిపోయింది. అనంతరం వెంటనే మహేంద్ర ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. నీలం సోదరుడు దినేష్ జాతవ్ వెంటనే వారి బంధువులకు ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో వైద్యులు ఆమెను పరీక్షించి అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించారు. నిందితుడు మహేంద్ర పరారీలో ఉండగా.. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Show comments