Site icon NTV Telugu

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం.. విద్యార్థినులు హిజాబ్ ధరించాలని బలవంతం

Hijab

Hijab

మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్ బోర్డు పరీక్షలో తమ స్కూలు టాపర్‌ల పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ముస్లింలు కాని కొంతమంది గర్ల్స్ స్కార్ప్స్ కట్టుకుని కనిపించారు. దీంతో పాఠశాలలో బాలికలందరినీ హిజాబ్ ధరించమని స్కూల్ యాజమాన్యం బలవంతం చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో దామోహ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మే 30న తమకు ఎన్‌సిపిసిఆర్ ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దీంతో దామోహ్ జిల్లా విద్యాశాఖాధికారి విద్యార్థుల కుటుంబాలను కలిశారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Also Read : Telangana Formation Day Celebrations: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

అయితే, దీనిపై తల్లిదండ్రులెవరూ ఫిర్యాదు చేయలేదని అధికారులు తెలిపారు. అమ్మాయిల స్కూల్ డ్రెస్ కోడ్‌లో స్కార్ఫ్ లు, సల్వార్, కుర్తా ఉంటాయి. గంగా జమున హయ్యర్ సెకండరీ స్కూల్ ముస్లిమేతర బాలికలను హిజాబ్ ధరించమని బలవంతం చేసిందని ఆరోపిస్తూ వీహెచ్ పి, బజరంగ్ దళ్, ఏబీవీపీ సహా మితవాద సంఘాలు నిరసన తెలిపాయి. అమ్మాయిలు హిజాబ్ ధరించలేదు, బదులుగా స్కార్ఫ్‌లు మాత్రమే ధరించారు. ఇది పాఠశాల దుస్తుల కోడ్‌లో భాగం మాత్రమే.. హిజాబ్ మొత్తం శరీరాన్ని కప్పివేస్తుంది.. స్కార్ఫ్‌ ఛాతీ వరకు మాత్రమే కప్పబడుతుంది.. మేము ఏ విద్యార్థినీ వారి సంప్రదాయాలు, సంస్కృతులకు వ్యతిరేకంగా ధరించమని బలవంతం చేయలేదని స్కూల్ డైరెక్టర్ ముస్తాక్ మహ్మద్ వెల్లడించారు.

Also Read : Guntur Kaaram: బాబు ల్యాండ్ అయితే రికార్డులకు బ్యాండే…

దీనిపై విచారణకు ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. ఇప్పటికీ మేము ఈ విషయంపై లోతైన విచారణ కోసం దామోహ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను కోరామని మిశ్రా చెప్పారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా విచారణకు ఆదేశించారు. విచారణలో వెల్లడైన నిజాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయని సీఎం చౌహాన్ చెప్పారు.

Exit mobile version