మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్ బోర్డు పరీక్షలో తమ స్కూలు టాపర్‌ల పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ముస్లింలు కాని కొంతమంది గర్ల్స్ స్కార్ప్స్ కట్టుకుని కనిపించారు. దీంతో పాఠశాలలో బాలికలందరినీ హిజాబ్ ధరించమని స్కూల్ యాజమాన్యం బలవంతం చేశారని ఆరోపించారు.