ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఇంటర్ బోర్డు లోకి ప్రవేశం నిషేధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు కమిషనర్. అయితే.. దీనిపై ఇంటర్ జాక్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమంగా నియామకం పొంది కోర్టు ఉత్తర్వుల ద్వారా కొనసాగుతున్న ఒక మహిళా ఉద్యోగి అభ్యర్థన మేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉన్న అధ్యాపకుల వ్యవస్థాపరంగా ఉన్నటువంటి సమస్యలు నివేదించడానికి ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడుగా ఉన్న బాధ్యత మరియు అధికారాన్ని కాలరాయడం కమిషనర్ ఉత్తర్వుల ద్వారా స్పష్టం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విధమైనటువంటి చర్యల ద్వారా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది అనుకుంటే అది ఆయన అవివేకమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధానాలు శోభనివ్వవని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విధానాలు అధ్యాపకులు మరింత ఐక్యంగా ముందుకు సాగి పోరాటాన్ని కొనసాగించడం ద్వారా ప్రభుత్వ ఇంటర్ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు. బోర్డు అధికారులు గుర్తు పెట్టుకోవాలని ఆయన చెప్పారు.
Also Read : Unstoppable: ఇక సోషల్ మీడియా మోత మొగిపోవాలి…
అయితే.. హైదరాబాద్లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (విద్యాభవన్), కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (ప్రొఫెసర్ జయశంకర్ విద్యా భవన్), నాంపల్లి కాలేజీ కాంప్లెక్స్ ల్లోకి మధుసూదన్ రెడ్డి ప్రవేశిస్తే నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా అతనితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకున్నా క్రిమినల్ చర్యగానే గుర్తించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంటర్ బోర్డ్ కార్యాలయంలోకి మధుసూదన్ రెడ్డి అక్రమంగా ప్రవేశించి, అక్కడి ఉద్యోగిని బెదిరించి సీసీ కెమెరాలను ట్యాంపర్ చేసినట్టు ఇంటర్ బోర్డ్ ఈ నెల 30న బేగంబజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయ డం తెలిసిందే. ఒక మహిళా ఉద్యోగిని మధు సూదన్ రెడ్డి లైంగికంగా వేధించడంతో పాటు ఆయనపై ఉన్న పలు ఏసీబీ, క్రిమినల్ కేసులను నవీన్ మిత్తల్ తన ఆదేశాల్లో వివరించారు.
Also Read : Miracle Escape : భూమ్మీద నూకలుండడం అంటే ఇదేనేమో.. జస్ట్ మిస్