NTV Telugu Site icon

Madhu Yashki : బచ్చాగాళ్లతో మేము క్యారెక్టర్ రుజువు చేసుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది

Madhu Yaskhi

Madhu Yaskhi

గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చకెక్కుతున్న విషయం తెలిసిందే. జూనియర్లు, సీనియర్లు అంటూ నాయకుల మధ్య చిచ్చురగులుకుంది. దీంతో.. అధిష్టానం దిజ్వియజ్‌సింగ్‌ను రంగంలోకి దింపడంతో.. ఆయన టీకాంగ్రెస్‌ నేతలతో సమస్య పరిష్కారానికి చొరవ చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ వ్యవహాల ఇంచార్జ్‌గా ఉన్న మాణిక్కం ఠాగూర్‌ను గోవాకు ఇంచార్జ్‌గా నియమించి.. గోవాకు ఇంచార్జ్‌గా ఉన్న మాణిక్‌ రావు థాక్రేను తెలంగాణకు ఇంచార్జీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింద కాంగ్రెస్‌ అధిష్టానం. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మాట్లాడుతూ.. కొత్త ఇంచార్జ్‌ నియామకం శుభపరిణామమన్నారు. ఇంచార్జ్‌ అందరిని కలుపుకుని పోవాలి… కానీ ఠాగూర్ అది విస్మరించారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. ఇంచార్జి సూపర్ పవర్ మ్యాన్ అనుకుంటున్నరూ.. ఠాగూర్ ఇంచార్జి అయ్యాక …మారిపోయారు.. మేము ఎవరిని మార్చాలని అడగలేదని ఆయన అన్నారు. దిగ్విజయ్ సింగ్ సూచన మేరకు ఇంచార్జ్‌గా మార్చారన్నారు. ఎవరు..ఇంకొకరి పదవి కోరుకోవడం లేదన్నారు. పీసీసీ అయినా.. ఇంకా ఏదైనా పదవి వచ్చిన వాళ్ళు అనుకువ ఉండాలన్నారు. మేము ఎవరికి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టలేదని, పార్టీ బాగుకోసం సమావేశం పెట్టామన్నారు.
Also Read : Ramya Raghupathi: నరేష్ ఒక నీచుడు.. రాఖీ కట్టిన అన్నతో నాకు ఎఫైర్ అంటగట్టాడు

సీనియర్లు.. జూనియర్లు అనేది ఏం లేదని, బచ్చాగాళ్లతో మేము క్యారెక్టర్ రుజువు చేసుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌కి మంచి రోజులు రావాలి..వస్తాయన్నారు. కాంగ్రెస్ వస్తేనే.. ప్రజలు బాగుంటారని, తెలంగాణ పదం తెలంగాణలో చంద్రబాబు నిషేధించారన్నారు. ఇప్పుడు కేసీఆర్ పార్టీ పేరులో తెలంగాణ పేరు లేకుండా చేశారన్నారు. దేశం కోసమే అయితే… తెలుగు రాష్ట్రాల విభజన కోసం ఎందుకు కొట్లాడావు అని ఆయన ప్రశ్నించారు. కొత్త ఇంచార్జి వచ్చాకా.. సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటామని, కర్ణాటకలో బస్సు యాత్ర చేస్తున్నారని, తెలంగాణలో కూడా అలాంటి కార్యాచరణ చేస్తే బావుంటుందన్నారు. అందరం కలిసి పనిచేయాలన్నారు మధు యాష్కీ.

Show comments