Site icon NTV Telugu

Bhatti Vikramarka: తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం.. కానీ ఓ కుటుంబానికి మాత్రమే జాబ్స్ వచ్చాయి!

Madhira Job Mela 2025

Madhira Job Mela 2025

తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అని, తెలంగాణ తెచ్చుకున్నాక ఓ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో నిరుద్యోగులందరికీ పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజీలతో సమయం అయిపోయిందని, కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో మెగా జాబ్‌ మేళా కార్యక్రమం జరిగింది. ఒకేరోజు 5 వేల మందికి ఉపాధి దక్కింది. ఉద్యోగాలు పొందిన వారికి డిప్యూటీ సీఎం భట్టి నియామకపత్రాలు అందజేశారు.

మెగా జాబ్‌ మేళా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. తెలంగాణ తెచ్చుకున్నాక ఓ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రజా పాలనలో నిరుద్యోగులందరికీ పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజీలతో సమయం అయిపోయింది. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. గత పది సంవత్సరాల్లో నిరుద్యోగులు, ఉద్యోగులు ఫలితాలు సాధించలేకపోయారు. ప్రజా ప్రభుత్వంలో మూడంచల్లో ఉద్యోగాల కల్పిస్తున్నాం. ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు, రెండు బహుళ జాతి సంస్థలకు వనరులు ఏర్పాటు చేసి రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, మూడు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాజీవ్ యువ వికాసం, జాబ్ మేళాలు. 5,000 మందికి యువతకు ఉపాధి కల్పించేందుకు హైదరాబాదులో మరో నాలెడ్జ్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. మధిర జాబ్ మేళా ద్వారా 5,000 మందికి ఒకేరోజు ఉపాధి లభించింది. రాష్ట్ర వనరులు, రాష్ట్ర భవిష్యత్తుకు, జీడీపీ పెరుగుదలకు, కుటుంబానికి, సమాజానికి పెద్ద ఎత్తున యువత ఉపయోగపడాలి. ప్రతి ఆలోచన మంచిది అయితే మంచి ఫలితాలు సాధిస్తారు. యువత మత్తు పదార్థాలు, సంఘవిద్రోహశక్తులకు దూరంగా ఉండాలి. చివరి దశలో తల్లిదండ్రులు బాధపడకుండా యువత చూసుకోవాలి’ అని అన్నారు.

Exit mobile version