Site icon NTV Telugu

Machilipatnam Police:మచిలీపట్నంలో ఉద్రిక్తత.. కొల్లు రవీంద్ర అరెస్ట్

Kollu Ravindra

Kollu Ravindra

కృష్ఱా జిల్లా రాజకీయాలు నిత్యం హాట్ హాట్ గా సాగుతుంటతాయి. తాజాగా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కోట్లాది రూపాయాల విలువచేసే ప్రభుత్వ భూమిని వైసీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ కొల్లు రవీంద్ర, కొనకళ్ల బల్లయ్యా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు పోలీసులు.

Read Also: Cinema Theatres: ప్రతి ముగ్గురిలో ఒకరి చూపు థియేటర్‌ వైపు

వైసీపీ కార్యాలయ స్థలాన్ని మీడియాకు చూపే ప్రయత్నం చేశారు కొల్లు రవీంద్ర. అయితే దీనికి పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో కొల్లు రవీంద్ర ను అడ్డుకున్నారు పోలీసులు, బల్లయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు, పోలీస్ చర్యలను ప్రతిఘటించారు కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. కొల్లు రవీంద్ర ను కూడా అరెస్టు చేసి గూడూరు వైపు తరలించారు పోలీసులు. దీంతో మచిలీపట్నం లక్ష్మీటాకీస్ సెంటర్ స్తంభించిపోయింది.

Read Also:Heavy Demand For Roses: ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. మన గులాబీలకు యమ గిరాకీ

గుడివాడలో టెన్షన్

గుడివాడ నాగవరప్పాడు అక్రమణల తొలగింపులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రోక్లైన్ కు అడ్డంగా కూర్చుని, ఇళ్ల కూల్చివేతలను అడ్డుకుంటున్నారు మహిళలు.నివాసితులను ఈడ్చేసి ఇళ్ల తొలగింపు కొనసాగిస్తున్న అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. బాధితులకు మద్దతుగా కూల్చివేతలను అడ్డుకున్నారు టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు.అధికారులతో, టిడిపి శ్రేణుల వాగ్వాదంతో వెనుతిరిగారు అధికారులు. స్థానికంగా ఉన్న వైసీపీ నేత భూముల ధరల పెరుగుదలకే పేదల ఇళ్ళను కుల్చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రావి. సాక్షాత్తు ఎమ్మెల్యే కొడాలి నాని ప్రభుత్వ భూములను అక్రమించుకుంటే చర్యలు శూన్యం అన్నారు. అధికారంలోకి వచ్చిన గంటలోనే, వైసిపి నేతల ఆక్రమణల, కూల్చివేతలు మొదలెడతాం అన్నారు మాజీ ఎమ్మెల్యే రావి.

Exit mobile version