Pinnelli Ramakrishna Reddy: 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు, లోకేష్ తోకలు కట్ చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మేరకు దోషులకు శిక్ష పడుతుందన్నారు.. కానీ, దీనిపై రాజకీయం చేయడం తగదన్నారు.. ఇక, నారా లోకేష్ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత.. 151 అసెంబ్లీ సీట్లు గెలిచిన సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేయాలంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు కారణంగానే రాష్ర్టానికి రాజధాని సమస్య ఏర్పడిందని విమర్శించారు.
Read Also: YS Viveka Case: వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. హైకోర్టుకు మరోసారి ఎంపీ అవినాష్‌రెడ్డి
మరోవైపు టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి భాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పైరవీలకు చెక్ పడిందన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా టిటిడి నిర్ణయాలు తీసుకుంటుందంటూ ప్రశంసలు కురిపించారు.. అటు సామాన్యలుకు.. ఇటు వీఐపీలకు ఇబ్బంది లేకుండా ధర్మారెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. కానీ, కొంతమందికి అసౌకర్యం కలిగినంత మాత్రాన.. టీటీడీపై విమర్శలు చేయడం తగదన్నారు.. ఇక, పల్నాడులో రాజకీయం ఎప్పుడు హీట్‌గా ఉంటుందని.. అందుకు తగ్గట్టుగానే రాబోవు ఎన్నికల్లో జిల్లాలోని 7కి ఏడు సీట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.