NTV Telugu Site icon

Pinnelli Ramakrishna Reddy Arrest: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్..

Pinnelli

Pinnelli

Pinnelli Ramakrishna Reddy Arrest: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఇంట్లో ఉన్న పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పల్నాడు ఎస్పీ ఆఫీసుకు తరలించారు.. పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్లు ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ఆ వెంటనే పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు.. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసులు నమోదైన విషయం విదితమే.. ఎన్నికల సందర్భంగా ఈవీఎం ధ్వంసం చేస్తూ దొరికిన విజువల్స్ తో పాటు పలు హత్యాయత్న కేసులు కూడా పిన్నెల్లి పై నమోదు అయ్యాయి.. గడిచిన కొద్ది వారాలుగా కండిషన్ బెయిల్ పై నరసరావుపేటలోని ప్రైవేట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి . పోలీసుల పర్యవేక్షణలో ప్రతినిత్యం ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం పెట్టి వచ్చేలాగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాస్‌పోర్ట్‌ను కూడా కోర్టు సీజ్ చేసిన నేపథ్యంలో నరసరావుపేటలోనే ఉంటున్నారు రామకృష్ణారెడ్డి … ఈరోజు పిన్నెల్లి పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు.

Read Also: Nagarjuna: మా నాగ్ బంగారం రా.. ఆ ఫ్యాన్ ను కలిసి ఫొటో ఇచ్చాడు!

కాగా, ఆ మూడు కేసుల్లో ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. అయితే, అరెస్టు నుంచి రక్షణ కోరుతూ పిన్నెల్లి బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు.. గతంలో నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్‌గా న్యాయవాది ఎన్‌.అశ్వినీకుమార్‌ వాదనలు వినిపించగా.. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు కొనసాగించారు.. గతంలో తీర్పును రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టు.. ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు ఇచ్చింది.. ముందస్తు బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.. పిన్నెల్లి పై ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు నమోదు చేశారు పల్నాడు పోలీసులు.. అయితే, ఈ కేసుల్లో ఆయనకు ఊరట కల్పిస్తూ.. ఏపీ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.. దీంతో.. ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పై ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ రోజు హైకోర్టు తీర్పు షాక్‌ ఇచ్చినట్టు అయ్యింది.. పిటిషన్లు మొత్తం డిస్మిస్‌ కావడంతో.. ఆ వెంటనే పిన్నెల్లిని అరెస్ట్‌చేశారు పోలీసులు.