Site icon NTV Telugu

Pinnelli Ramakrishna Reddy: అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్‌?

Pinnelli Brothers

Pinnelli Brothers

Pinnelli Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన అనంతరం అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడుతో పాటు తదితర జిల్లాల్లో 144 సెక్షన్‌ కూడా విధించారు. ఎన్నికల సంఘం కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ కూడా తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. తాజాగా అల్లర నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరూ గన్‌మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ పరిణామంతో పిన్నెల్లి గన్‌మెన్లు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కారంపూడి అల్లర్ల నేపథ్యంలో, అరెస్టులు తప్పవన్న సంకేతాలతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. వారు విశ్రాంతి కోసం హైదరాబాద్‌ వెళ్లారని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు.

Read Also: Patna crime: స్కూల్ ఆవరణలో 3 ఏళ్ల చిన్నారి మృతదేహం లభ్యం.. రణరంగంగా పాట్నా

Exit mobile version