Road Accident: రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి

Accident

Accident

Road Accident: బాపట్ల జిల్లా బాపట్ల మండలంలోని ఈతేరు-చుండూరుపల్లి గ్రామాల ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శవణం గోపిరెడ్డి (30)అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్‌మెన్‌గా గుర్తించారు. బాపట్లలోని ఉప్పెరపాలెంకు చెందిన శవణం గోపిరెడ్డి 2018లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరగా.. ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Read Also: Lovers Suicide: అరకు లోయలో ప్రేమ జంట ఆత్మహత్య

ఆదివారం బైక్‌పై బాపట్ల వస్తుండగా.. లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో.. ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. దీంతో వెనుక నుంచి లారీ, ఆపై ముందు నుంచి బస్సు ఢీ కొట్టాయి. తలకు తీవ్రగాయాలు కావడంతో గోపిరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గోపిరెడ్డి మృతితో అతడి కుటుంబాన్ని విషాదఛాయలు అలుముకున్నాయి.