Macharla CI: పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్!

  • పల్నాడు జిల్లా మాచర్లలో పరువు హత్య
  • పరువు హత్య కేసులో డబ్బులు తీసుకున్న మాచర్ల సీఐ
  • మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్
Macharla Ci Suspended

Macharla Ci Suspended

పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం సృష్టించిన‌ పరువు హత్య కేసులో మాచర్ల టౌన్ సీఐ వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. మాచర్లకు చెందిన చౌడేశ్వరి, జమ్మలమడకకు చెందిన నాగరాజులు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోరని ఇంట్లో నుంచి పారిపోయి పెళ్ళి చేసుకున్నారు. చౌడేశ్వరి తండ్రి చంద్ర శీను ఫిర్యాదుతో మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. చౌడేశ్వరి, నాగరాజులను వెతికి పట్టున్న పోలీసులు మాచర్ల తీసుకొచ్చారు.

Also Read: Nelakota Hill Tiger: నేలకోట కొండపై తిష్ట.. స్థానికుల కంటపడిన మన్యం పులి!

×
×
Ad

తాను నాగరాజు ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని చౌడేశ్వరి పోలీసులకు చెప్పింది. అయితే సీఐ వెంకటరమణ చౌడేశ్వరి తండ్రి వద్ద డబ్బులు తీసుకుని ఆమెను వారికి అప్పగించారు. రెండు రోజుల తర్వాత చౌడేశ్వరి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే పోస్టుమార్టంలో చౌడేశ్వరిని హత్య చేశారని తేలింది. మేజర్ అయిన చౌడేశ్వరిని తల్లిదండ్రులకు అప్పగించడంలో సీఐ వెంకటరమణ కీలకపాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్డిన పోలీసులు.. సీఐ పాత్ర ఉందని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.