Site icon NTV Telugu

Lust Stories 3 : త్వరలోనే బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్న మేకర్స్..?

Whatsapp Image 2023 07 05 At 2.16.49 Pm

Whatsapp Image 2023 07 05 At 2.16.49 Pm

లస్ట్ స్టోరీస్ మొదటి భాగం ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ వెబ్ సిరీస్ కు రెండవ భాగం ను తెరకెక్కించారు.లస్ట్ స్టోరీస్ సెకండ్ పార్ట్ ని నాలుగు కథలుగా తెరకెక్కించారు. ఈ నాలుగు కథలకు  కొంకనా సేన్ శర్మ, ఆర్ బాల్కీ, సుజయ్ ఘోష్‌ మరియు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ నాలుగు కథల్లో అంగద్ బేడీ, మృణాల్ ఠాకూర్‌, నీనా గుప్తా, విజయ్ వర్మ, తమన్నా భాటియా, కాజోల్‌, కుముద్ మిశ్ర, తిలోత్తమ శోమ్‌ మరియు అమృత సుభాష్ నటించారు. లస్ట్ స్టోరీస్ ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే, సెకండ్ పార్ట్ కి అంత ఆశించిన స్పందన అయితే రాలేదు.ఈ సిరీస్ లో పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయాలి వంటి డైలాగులకు మిశ్రమ స్పందన వచ్చింది. అయినా యూత్‌లో ఈ వెబ్ సిరీస్ కు ఉన్న క్రేజ్ చూసి మరో సీరీస్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్.

అయితే లస్ట్ స్టోరీస్ సెకండ్ పార్ట్ ను డైరక్ట్ చేసిన నలుగురు డైరక్టర్లతోనే థర్డ్ పార్ట్ ను తెరకెక్కిస్తున్నారా లేకుంటే కొత్తగా వేరే డైరెక్టర్స్ ను అప్రోచ్ అవుతున్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని తెలుస్తుంది.లస్ట్ స్టోరీస్ 3 లో ఎలాంటి కథలను డీల్ చేయబోతున్నారు. ఆ కథలకు మరోసారి పాపులర్ ఆర్టిస్ట్ లను తీసుకోనున్నారా వంటి అంశాల గురించి త్వరలోనే అన్నీ వివరాలు ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు..అలాగే లస్ట్ స్టోరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారని సమాచారం.సుజయ్ ఘోష్ లస్ట్ స్టోరీస్‌2 గురించి ఇటీవల మాట్లాడుతూ “ఈ పార్ట్ కి మంచి ఆర్టిస్టులు దొరికారు.. విజయ్‌ వర్మ , తమన్నా రిలేషన్‌షిప్‌ గురించి మాకు ముందుగా ఏమీ తెలియదు.జస్ట్ వాళ్ళ పెయిర్ బావుంటుందనుకుని మేము వారిని తీసుకున్నాం. స్క్రిప్ట్ చదివి తమన్నా విజయ్ వర్మను కొన్ని ప్రశ్నలు అడిగారు.. విజయ్ వర్మ వాటికి సమాధానం ఇవ్వడం జరిగింది. అలా వారితో లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ మొదలు అయ్యింది అని ఆయన చెప్పుకొచ్చారు..

Exit mobile version